టీడీపీతో పొత్తు కుదిరితే.. బీజేపీ ఆశిస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే? అభ్యర్థులు వీళ్లే?

రాష్ట్రంలో బలపడాలని కోరుకుంటున్న బీజేపీ.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటోంది..? ఎక్కడెక్కడ బీజీపీ బలంగా ఉంది? ఆ స్థానాలు బీజీపీకి ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందా?

టీడీపీతో పొత్తు కుదిరితే.. బీజేపీ ఆశిస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే? అభ్యర్థులు వీళ్లే?

TDP BJP Alliance Politics

TDP BJP Alliance : టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు పొడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో రెండు పార్టీల మధ్య బంధానికి తొలి అడుగు పడబోతోందా? హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశం కానున్న చంద్రబాబు.. వారితో ఏం చర్చించనున్నారు. ఇరుపార్టీల మధ్య పొత్తు ఒక్కటేనా? ఇంకేమైనా అంశాలు చర్చించే అవకాశం ఉందా?

దేశవ్యాప్తంగా ఎన్‌డీఏని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టిన బీజేపీ.. బీహార్‌లో నితీశ్‌కుమార్‌తో చేతులు కలిపింది. ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డీని మచ్చిక చేసుకుంటోంది. ఈ సమయంలోనే చంద్రబాబును ఢిల్లీ పిలిచి మాట్లాడుతుండటంతో పొత్తు దిశగానే ఇరుపార్టీల ప్రయాణం సాగించబోతున్నాయా? అన్నది తేలాల్సివుంది.

అసలు ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరితే.. ఏపీ రాజకీయం ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో బలపడాలని కోరుకుంటున్న బీజేపీ.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటోంది..? ఎక్కడెక్కడ బీజీపీ బలంగా ఉంది? ఆ స్థానాలు బీజీపీకి ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందా?

ఏపీలో బీజేపీ బలం.. బలగం.. గతంలో ఆ పార్టీ గెలిచిన స్థానాలు.. ఇప్పుడు అడగబోయే స్థానాలు ఏవి? ఆ స్థానాలనే ఎందుకు కోరుకుంటుంది? ఇన్ డెప్త్ అనాలసిస్..

Also Read : సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన గోనె ప్రకాశ్ రావు

2014లో బీజేపీ పోటీ చేసిన ఎంపీ స్థానాలు :

విశాఖపట్నం, నరసాపురం, తిరుపతి, రాజంపేట
బీజేపీ గెలిచిన స్థానాలు : విశాఖపట్నం – కంభంపాటి హరిబాబు
నరసాపురం – గోకరాజు గంగరాజు
—————–
2014లో బీజేపీ పోటీచేసిన అసెంబ్లీ స్థానాలు

10 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ
విశాఖ నార్త్‌, పాడేరు, రాజమండ్రి అర్బన్‌, కైకలూరు, తాడేపల్లిగూడెం, కోడుమూరు, మదనపల్లె, నరసారావుపేట, నెల్లూరు రూరల్‌, విజయవాడ వెస్ట్‌

2014 నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన బీజేపీ
విశాఖ నార్త్‌, తాడేపల్లిగూడెం, రాజమండ్రి అర్బన్‌, కైకలూరుల్లో గెలిచిన బీజేపీ
2014లో బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇచ్చిన టీడీపీ
————
ప్రస్తుతం బీజేపీ అడుగుతున్న స్థానాలు

10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్న బీజేపీ
5 నుంచి ఏడు పార్లమెంట్‌ స్థానాలు అడిగే చాన్స్‌

బీజేపీ కోరుతున్న పార్లమెంట్‌ స్థానాలు
విశాఖపట్నం, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, నర్సాపురం, అరకు, హిందుపురం

బీజేపీ ఆశిస్తున్న ఎమ్మెల్యే సీట్లు
విశాఖ నార్త్‌, పి.గన్నవరం, రాజమండ్రి అర్బన్‌, తాడేపల్లిగూడెం, కైకలూరు, తంబళ్లపల్లె, కదిరి, జమ్మలమడుగు, ధర్మవరం, ఒక ఎస్టీ సీటు

————————————–

విశాఖపట్నం – జీవీఎల్‌ నరసింహరావు/ సీఎం రమేశ్‌
రాజమండ్రి – పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
రాజంపేట – నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి
తిరుపతి – రత్నప్రభ, రిటైర్డ్‌ ఐఏఎస్‌
నరసాపురం – రఘురామకృష్ణరాజు
అరకు – కొత్తపల్లి గీత
హిందూపురం – సత్యకుమార్‌/ స్వామి పరిపూర్ణానంద

Also Read : ఆ రెండు కులాలకే ఎమ్మెల్యే ఛాన్స్‌.. రామచంద్రపురంలో ఆసక్తికర రాజకీయం!

అసెంబ్లీ స్థానాలు
విశాఖ ఉత్తర – విష్ణుకుమార్ రాజు
విశాఖ తూర్పు – మాధవ్
రాజమండ్రి సిటీ – సోము వీర్రాజు
పి.గన్నవరం – మానేపల్లి అయ్యాజివేమ
కైకలూరు – కామినేని శ్రీనివాస్
తిరుపతి – భానుప్రకాశ్‌ రెడ్డి
తంబళ్లపల్లె – చల్లా నరసింహారెడ్డి
శ్రీకాళహస్తి – కోలా ఆనంద్‌
గుంటూరు వెస్ట్‌ – వల్లూరి జయప్రకాష్ నారాయణ
ధర్మవరం – గోనుగుంట్ల సూర్యనారాయణ
కదిరి – విష్ణువర్ధన్‌రెడ్డి
జమ్మలమడుగు – ఆదినారాయణరెడ్డి

—————————
చంద్రబాబే ఎందుకు?
1. ఎన్డీఏలో లేకపోయినా బీజేపీకి అన్నివిధాలా సహకరిస్తున్న వైసీపీ
2. జగన్‌ సహకరిస్తున్నా చంద్రబాబుతో బీజేపీ పొత్తు కోరుకోవడానికి కారణాలు ఏంటి?
3. బీజీపీకి కావాల్సిన రాజ్యసభ ఎంపీలు లేని టీడీపీతో మితృత్వం దేనికి సంకేతం?
4. ఈ నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలవకపోతే… వచ్చే రెండేళ్ల వరకు రాజ్యసభ సభ్యుడి లేని టీడీపీతో బీజేపీకి ఎలాంటి లాభం?
5. టీడీపీతో పొత్తు కుదిరితే ఇన్నాళ్లు సహకరించిన వైసీపీపై బీజేపీ విధానం ఎలా ఉండబోతోంది?
6. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి బలం 9,
7. ఇందులో ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్న స్థానాలు 3,
8. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ వాస్తవ బలంతో గెలిచే సీట్లు 3
9. వచ్చే రెండేళ్ల వరకు వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉండే అవకాశం

Also Read : టార్గెట్ యాదవులు.. అన్ని పార్టీల గురి వారి ఓట్లపైనే, ఏపీలో సరికొత్త రాజకీయం