Minister Roja : చంద్రబాబు, వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని సూచించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మేసే వారని చెప్పిన షర్మిల ఏ మొఖం పెట్టుకుని ..

Minister Roja : చంద్రబాబు, వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Minister Roja

Minister RK Roja Comments : ఏపీ మంత్రి ఆర్కే రోజా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వే స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ ను పర్యాటక క్రీడా శాఖ మంత్రి రోజా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. టీడీపీతో కలిసొచ్చే పార్టీలతో ప్రజలు ఆడుకుంటారు.. ఓడించి హైదరాబాద్ తరిలిమేస్తారని అన్నారు. చంద్రబాబు హయాంలో చేసిన ప్రభుత్వ కార్యక్రమాలకు చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫొటోలు పెట్టారా? మా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలు పెట్టమంటారా అంటూ వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డిపై క్రీడాకారులు, క్రీడాభిమానుల అందరి అభిమానం ఉంది. జగన్ ఆటలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి కడుపు మంట తారా స్థాయికి వెళ్లింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటో కాకుండా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫొటో పెడతారా అంటూ రోజా సెటైర్లు వేశారు.

Also Read : Lakshmi Parvathi: అమిత్ షాను చంద్రబాబు కలవలేదు.. కలిస్తే ఫోటో చూపించాలి..

చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలంటే కచ్చితంగా పోటీ పడాలి. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత కాంసెంట్రేట్ గా ఉంటుందో.. గెలవాలంటే అంతే కసి ఉండాలని రోజా అన్నారు. మీ అందరిలో క్రీడా స్ఫూర్తి నింపడమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అని, సచివాలయం స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు క్రీడల్లో పోటీపడ్డాని అన్నారు. జగనన్నపై క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరి అభిమానం ఉందన్నారు.

Also Read : CM Jagan Delhi Tour : పార్లమెంట్‌లో ప్ర‌ధాని మోదీతో ముగిసిన సీఎం జ‌గ‌న్ భేటీ.. ఏఏ అంశాల‌పై చ‌ర్చించారంటే?

వైఎస్ షర్మిలపైనా మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని సూచించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మేసే వారని చెప్పిన షర్మిల ఏ మొఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ మంత్రి రోజా విమర్శించారు. జగన్ ను జైలుపాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారు. తన పార్టీని కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేసిందో షర్మిల చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఆస్తులను షర్మిల రాబట్టాలని రోజా అన్నారు.