Ravindra Jadeja Father : కొడుక్కి పెళ్లి చేసి తప్పు చేశా.. కోడలి వల్లే మా కుటుంబంలో చీలికలు.. జడేజా తండ్రి సంచలన ఆరోపణలు
జాడేజాపై అతడి తండ్రి అనిరుధ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు.
Ravindra Jadeja : టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. ప్రస్తుతం అతడు గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్కు దూరం అయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకున్నాడు. మూడో టెస్టు నాటికి అందుబాటులోకి వస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే.. జాడేజాపై అతడి తండ్రి అనిరుధ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు.
తన కుమారుడికి పెళ్లి చేసిన తరువాత నుంచి తమ మధ్య ఉన్న బంధం తెగిపోయిందని చెప్పాడు. ఒకే ఊరిలో ఉంటున్నా కూడా కనీసం కలుసుకోవడం లేదన్నాడు. ఐదేళ్లుగా తన మనువరాలిని చూడలేదని తెలిపాడు.
Viral Video : వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు.. ఈ అంపైర్ చాలా ఫన్నీ గురూ
2016లో రివాబాను రవీంద్ర జడేజా వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండు, మూడు నెలల తరువాత నుంచి తన కొడుకుతో సంబంధాలు తెగిపోయాయని అనిరుధ్ సింగ్ అన్నాడు. తమ కుటుంబంలో చీలికలు రావడానికి రివాబా కారణం అని ఆయన ఆరోపించారు. జామ్నగర్లోనే తాను ఒంటిరిగా ఉంటున్నానని చెప్పాడు. ఒకే ఊరిలో ఉన్నా కూడా కనీసం తన కొడుకు ముఖాన్ని కూడా చూడడం లేదన్నారు.
వాళ్లని మేము పిలవము, అలాగే వారు మాకు ఫోన్ కూడా చేయరు. జామ్నగర్లోనే జడేజా తన స్వంత బంగ్లాలో నివాసం ఉంటున్నాడు. అతడి భార్య ఏం చేసిందో తనకు తెలియని చెప్పాడు. అతడి మనసుని మార్చేసి ఉంటుందని తెలిపాడు. అతడికి పెళ్లి చేసి తప్పుచేశాను. అతడు క్రికెటర్ కాకపోయి ఉన్నా బాగుండేది. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. వివాహమైన మూడు నెలలకే మొత్తం తన పేరు మీదికి మార్చాలని ఆమె చెప్పింది. మా కుటుంబంలో చీలిక తెచ్చింది. కుటుంబం వద్దని స్వతంత్రంగా బతకాలని ఆమె భావించింది. గత ఐదేళ్లుగా మనవరాలి ముఖం కూడా చూడలేదని అనిరుధ్ సింగ్ అన్నాడు.
ఇదిలా ఉంటే.. రివాబా డిసెంబర్ 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ నార్త్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఆమె బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు.
Ravindra Jadeja’s father Anirudhsinh Jadeja makes shocking revelations 😳#Cricket #RavindraJadeja #RivabaJadeja #CSK #CricketTwitter pic.twitter.com/lOZne1OYVN
— SportsTiger (@The_SportsTiger) February 9, 2024