David Warner : చ‌రిత్ర సృష్టించిన డేవిడ్ వార్న‌ర్‌.. ఆసీస్ క్రికెట‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర‌ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

David Warner : చ‌రిత్ర సృష్టించిన డేవిడ్ వార్న‌ర్‌.. ఆసీస్ క్రికెట‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

David Warner

Warner : ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర‌ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల‌లో 100 మ్యాచులు ఆడిన తొలి ఆస్ట్రేలియా ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఓవ‌ల్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచ్ ద్వారా వార్న‌ర్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఇక ఓవ‌రాల్‌గా ఈ ఘ‌న‌త సాధించిన మూడో ఆట‌గాడిగా నిలిచాడు. వార్న‌ర్ కంటే ముందు టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ మాజీ ఆట‌గాడు రాస్ టేల‌ర్‌లు మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించారు.

టీమ్ఇండియా త‌రుపున కోహ్లీ 113 టెస్టులు, 292 వ‌న్డేలు, 117 టీ20 మ్యాచులు ఆడాడు. రాస్ టేల‌ర్ న్యూజిలాండ్ త‌రుపున 112 టెస్టులు, 236 వ‌న్డేలు, 102టీ20లు ఆడాడు. ఇక వార్న‌ర్ విష‌యానికి వ‌స్తే.. 112టెస్టులు, 161 వ‌న్డేలు, 100 టీ20లు ఆడాడు. కాగా.. ఇప్ప‌టికే టెస్టులు, వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన వార్న‌ర్ కేవ‌లం టీ20లు మాత్ర‌మే ఆడుతున్నాడు.

IND vs ENG : మూడో టెస్టుకు ముందు భార‌త్‌కు భారీ షాక్‌..! మిగిలింది రోహిత్ శ‌ర్మ మాత్ర‌మే!

ఈ మైలురాయి మ్యాచులో వార్న‌ర్ పెను విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల‌ను ఎదుర్కొన్న అత‌డు 12 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 70 ప‌రుగులు చేశాడు. వార్న‌ర్‌తో పాటు జోష్ ఇంగ్లిస్ (39; 25 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌), టిమ్ డేవిడ్ (37 నాటౌట్; 17 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స‌ర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 213 ప‌రుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్ల‌లో ఆండ్రీ రసెల్ మూడు వికెట్లు తీశాడు. అల్జారీ జోసెఫ్ రెండు, జేస‌న్ హోల్డ‌ర్‌,రొమారియో షెపర్డ్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం బ్రెండ‌న్ కింగ్ (53; 37 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్‌) అర్ధ‌శ‌త‌కం చేయ‌గా, జాన్సన్ చార్లెస్ (42; 25 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌), జేస‌న్ హోల్డ‌ర్ (34 నాటౌట్; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌)ల‌తో రాణించినప్ప‌టికీ ల‌క్ష్య ఛేద‌న‌లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 202 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ఆస్ట్రేలియా 11 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ జంపా మూడు వికెట్లు తీశాడు. మార్క‌స్ స్టోయినిస్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

Ravindra Jadeja Father : కొడుక్కి పెళ్లి చేసి త‌ప్పు చేశా.. కోడ‌లి వ‌ల్లే మా కుటుంబంలో చీలిక‌లు.. జ‌డేజా తండ్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు