AP Elections 2024: టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన ఎప్పుడో తెలుసా?

ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్ఠానం పిలుపు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుచూస్తున్నారు.

AP Elections 2024: టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన ఎప్పుడో తెలుసా?

AP Elections 2024

Janasena Party: ఎన్నికల వేళ టీడీపీ-జనసేన అభ్యర్థుల పేర్ల ప్రకటనపై బీజేపీ ప్రభావం పడుతోంది. దీంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. ఈ నెల 14న అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ-జనసేన సూచనప్రాయంగా నిర్ణయించాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటన, కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చల నేపథ్యంలో ప్రకటనను టీడీపీ-జనసేన వాయిదా వేసుకున్నాయి. 10 రోజుల తర్వాతే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్ఠానం పిలుపు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుచూస్తున్నారు.

మరోసారి బీజేపీ అధిష్ఠానాన్ని కలిసిన తర్వాతే సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగే అవకాశం ఉంది. మొన్న చంద్రబాబు, అమిత్ షా భేటీలో సీట్లపై చర్చ జరగలేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అమరావతి రాజధానితో పాటు పోలవరంపై ప్రధాని మోదీతో ప్రకటన చేయిస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

త్వరలోనే ఎన్డీయేలో కొత్త మిత్రులు చేరుతారంటూ అమిత్ షా కూడా వ్యాఖ్యానించారు. టీడీపీ-జనసేనతో బీజేపీ కలిస్తే కాషాయ పార్టీకి ఇవ్వాల్సిన సీట్లపై కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

Read Also: అందుకే ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టాం: మీడియాతో రేవంత్ రెడ్డి