No Ball Six Hit wicket : ఇలా ఎప్పుడూ చూసి ఉండ‌రు.. ఒకే బంతికి నోబాల్‌, సిక్స్‌, హిట్‌వికెట్‌..

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడూ కొన్ని అద్భుత ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి.

No Ball Six Hit wicket : ఇలా ఎప్పుడూ చూసి ఉండ‌రు.. ఒకే బంతికి నోబాల్‌, సిక్స్‌, హిట్‌వికెట్‌..

Alana King Hits Six Off No Ball But Ends Up Being Hit Wicket Umpire's Decision Stuns SA

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడూ కొన్ని అద్భుత ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి. వాటిని చూస్తే ఓ క్ష‌ణ‌కాలం పాటు న‌మ్మ‌లేము. తాజాగా అలాంటి ఓ అసాధార‌ణ దృశ్యం ఆవిష్కృత‌మైంది. ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన‌ వ‌న్డే మ్యాచులో ఇది చోటు చేసుకుంది. ఒకే ఒంతికి నోబాల్‌, సిక్స్‌, హిట్ వికెట్ న‌మోదైంది. ఒకే స‌మ‌యంలో ఇలా జ‌ర‌గడాన్ని చూసిన ప్రేక్ష‌కులు సంభ్రమాశ్చర్యాలకు లోనైయ్యారు.

సిండే ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా మ‌హిళ‌లు, ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 48వ ఓవ‌ర్‌ను ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ మసాబాటా క్లాస్ వేసింది. ఆ స‌మ‌యంలో ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ అలనా కింగ్ స్ట్రైకింగ్‌లో ఉంది. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతిని క్లాస్‌.. హై పుల్ టాస్ గా వేసింది. ఆ బంతిని అల‌నా సిక్స‌ర్‌గా మ‌లిచింది. అదే స‌మ‌యంలో త‌న బ్యాలెన్స్ కోల్పోయింది. వికెట్ల పై ప‌డింది. అయితే.. న‌డుము కంటే ఎక్కువ ఎత్తుగా బంతి వేయ‌డంతో లెగ్‌ అంపైర్ నో బాల్‌గా ప్ర‌క‌టించారు.

CSK : చెన్నై కొత్త స్పాన్స‌ర్‌ను చూశారా?

ఆ బంతి నోబాల్ కావ‌డంతో అలానా ఔట్ కాలేదు. దీంతో ఒక్క బంతికే ఏడు ప‌రుగులు వ‌చ్చాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మ‌హిళ‌లు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 277 ప‌రుగులు చేసింది. బెత్ మూనీ (82) టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. అలిస్సా హీలీ (60) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా త‌హ్లియా మెక్‌గ్రాత్ 44 ప‌రుగుల‌తో రాణించింది. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో క్లాస్ 56 ప‌రుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్షిణాఫ్రికా 14 ఓవ‌ర్ల‌లో 63 ప‌రుగుల‌కు నాలుగు వికెట్లు కోల్పోయింది.

Viral Video : బ్యాట‌ర్ ఏదో క‌నిక‌ట్టు చేసిన‌ట్లు ఉన్నాడుగా..!

ఈ స‌మ‌యంలో వ‌ర్షం ప‌డింది. దీంతో ద‌క్షిణాఫ్రికా ల‌క్ష్యాన్ని 31 ఓవ‌ర్ల‌లో 238గా నిర్దేశించారు. కాగా.. ద‌క్షిణాఫ్రికా 24.3 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 110 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు 2-1తో గెలుచుకుంది.