Hanuman : ‘హనుమాన్’ సరికొత్త రికార్డ్.. ఏకంగా 300 సెంటర్స్‌లో.. చాలా ఏళ్ళ తర్వాత సినీ పరిశ్రమలో ఇలా..

సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోల సినిమాలన్నీ ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేస్తే హనుమాన్ సినిమా మాత్రం ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తూ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

Hanuman : ‘హనుమాన్’ సరికొత్త రికార్డ్.. ఏకంగా 300 సెంటర్స్‌లో.. చాలా ఏళ్ళ తర్వాత సినీ పరిశ్రమలో ఇలా..

Teja Sajja Prasanth Varma Hanuman Movie Creates new Record in 300 Theaters

Hanuman : ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎవ్వరూ ఊహించని విధంగా అన్ని ఏరియాలలో పెద్ద హిట్ కొట్టి ఇప్పటికే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది సినిమా. ఇప్పటికే హనుమాన్ సినిమా కలెక్షన్స్ విషయంలో పలు రికార్డులు సెట్ చేయగా చిత్రయూనిట్ ఈ సక్సెస్ పై ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ, అమెరికాలో కూడా సక్సెస్ టూర్స్ వేశారు.

హనుమాన్ సినిమాకి సీక్వెల్ జై హనుమాన్ వర్క్ కూడా మొదలు పెట్టానని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోల సినిమాలన్నీ ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేస్తే హనుమాన్ సినిమా మాత్రం ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తూ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హనుమాన్ సినిమా 30 రోజుల్లో ఏకంగా 300 సెంటర్స్ లో ఇంకా నడుస్తుంది. చిత్రయూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.

Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ అనౌన్స్ చేసి మూడేళ్లు.. ఒక్క టైటిల్ ఫోటో తప్ప ఏం లేదు.. పాపం చరణ్ ఫ్యాన్స్..

ఇటీవల ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా రెండు వారాలకు మించి థియేటర్స్ లో ఉండట్లేదు. ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం 50 డేస్, 100 డేస్ ఇన్ని థియేటర్స్ లో ఆడుతుందని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఒక చిన్న సినిమా ఆ రేంజ్ విజయం సాధించి ఏకంగా 300 థియేటర్స్ లో నడుస్తుంది అంటే మాములు విషయం కాదు. హనుమాన్ ఓటీటీకి ఇప్పట్లో రాదు కాబట్టి ఇంకో 20 రోజులు కూడా ఆడి 50 డేస్ కూడా థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుంటుంది. హనుమాన్ సినిమా 50 రోజులు ఎన్ని థియేటర్స్ లో ఆడుతుందో చూడాలి.