Sonia Gandhi: సంచలన నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీ

ఈ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. 

Sonia Gandhi: సంచలన నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీ

Sonia Gandhi

Sonia Gandhi : వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (77) నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలి నుంచి సోనియా గాంధీ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ వెళ్లనున్నట్లు సమాచారం. సోనియా గాంధీ 2006 నుంచి ఇప్పటివరకు రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో అంతగా రాణించని సమయంలోనూ ఆమె గెలిచారు. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని ఆమెను కోరతామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్నారు. చివరకు ఆమె లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవడం లేదు.

మరికొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయారు. కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ గెలిచారు.

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ బలం తగ్గిపోతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఇక ప్రియాంకా గాంధీ ఇంతవరకు ఎన్నికల బరిలో దిగలేదు. ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలి నుంచి ప్రియాంకా గాధీ పోటీ చేస్తే తొలిసారి పోటీ చేసినట్లవుతుంది.

Read Also: ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 44 నుంచి 46 ఏళ్లకు పెంపు