SP Charan : SP చరణ్ వర్సెస్ తరుణ్ భాస్కర్.. SP బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌ని అలా చేసినందుకు.. లీగల్ నోటిస్..

SP చరణ్ తాజాగా కీడాకోలా మూవీ యూనిట్ కి లీగల్ నోటీసులు పంపించారు.

SP Charan : SP చరణ్ వర్సెస్ తరుణ్ భాస్కర్.. SP బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌ని అలా చేసినందుకు.. లీగల్ నోటిస్..

SP Charan sends Legal Notice to Tharun Bhascker Keedaa Cola Movie Unit fir using SP Balasubrahmanyam AI Voice

SP Charan : ఇటీవల AI (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) వాడి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇదే AIతో మరణించిన వారి వాయిస్ లని కూడా తిరిగి సృష్టిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే AR రహమాన్ లాల్ సలామ్ సినిమా కోసం మరణించిన ఇద్దరు తమిళ్ సింగర్స్ వాయిస్ లని AI తో సృష్టించి ఆశ్చర్యపరిచారు. దీనిని రహమాన్ బాగానే ప్రచారం చేసుకున్నారు. ఆ సింగర్స్ ఫ్యామిలీల పర్మిషన్స్ తీసుకొని వారికి తగినంత పారితోషికం ఇచ్చారు రహమాన్.

అయితే అంతకుముందే తరుణ్ భాస్కర్(Tharun Bhascker) తన కీడాకోలా(Keeda Cola) సినిమాలో SP బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ని AI తో సృష్టించారు. ఆ సినిమాలో స్వాతిలో ముత్యమంత.. సాంగ్ ని ఓ సన్నివేశంలో వినియోగించారు. అప్పుడు అంతా అది రియల్ వాయిస్, పాత పాటలోదే అనుకున్నారు. కానీ అది AI తో సృష్టించిందని తరుణ్ భాస్కర్ తర్వాత ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ వార్త SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు SP చరణ్ దాకా వెళ్ళింది.

Also Read : Amaran Glimpse : శివకార్తికేయన్ ‘అమరన్’ టైటిల్ గ్లింప్స్ చూశారా? కశ్మీర్ నేపథ్యంలో..

దీంతో SP చరణ్ తాజాగా కీడాకోలా మూవీ యూనిట్ కి లీగల్ నోటీసులు పంపించారు. ఆ నోటీసులో.. నాన్న చనిపోయినా టెక్నాలజీ ఉపయోగించి ఆయన గోతుకి జీవం పోసి బతికించడం మంచి పరిణామమే. కానీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి తీసుకోకుండా అలా నాన్న గారి వాయిస్ ని రీ క్రియేట్ చేయడం మాకు బాధగా అనిపించింది అని తెలిపారు. అలాగే ఆయన గొంతుని అనైతికంగా వాడుకున్నందుకు క్షమాపణలు చెప్పి నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. మరి దీనిపై కీడాకోలా చిత్రయూనిట్ కానీ, తరుణ్ భాస్కర్ కానీ స్పందిస్తారేమో చూడాలి.