Vishwak Sen – Adivi Sesh : విశ్వక్ సేన్ చేయాల్సిన సినిమా.. అడివి శేష్ చేశాడు.. ఏదో తెలుసా..?

విశ్వక్ చేయాల్సిన ఓ సినిమాని అడివి శేష్ చేసి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? విశ్వక్ ఆ మూవీని ఎందుకు చేయలేదు..?

Vishwak Sen – Adivi Sesh : విశ్వక్ సేన్ చేయాల్సిన సినిమా.. అడివి శేష్ చేశాడు.. ఏదో తెలుసా..?

Adivi Sesh is casted for movie who primarly selected by Vishwak Sen

Vishwak Sen – Adivi Sesh : టాలీవుడ్ హీరోలు విశ్వక్ సేన్, అడివి శేష్ తమ తమ స్టైల్స్ లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. అయితే వీరి కెరీర్ లో విశ్వక్ చేయాల్సిన ఓ సినిమాని అడివి శేష్ చేసి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఆ విషయాన్ని విశ్వక్ రీసెంట్ ఇంటర్వ్యూలో అందరికి తెలియజేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? విశ్వక్ ఆ మూవీని ఎందుకు చేయలేదు..?

విశ్వక్ సేన్, అడివి శేష్ కలిసి నటించలేదు. కానీ ఈ ఇద్దరు కలిసి భాగస్వామ్యం అయిన సినిమా అంటే.. ‘హిట్’ యూనివర్స్. నాని నిర్మాణంలో శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన మొదటి మూవీ ‘హిట్’. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. 2020లో రిలీజైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆ మూవీ ఎండింగ్ లోనే సీక్వెల్ కూడా ఉంటుందని శైలేష్ కొలను ప్రకటించేసారు.

Also read : Vishwak Sen : సినిమా షూటింగ్‌లో నాకు గాయం అయితే.. బాలకృష్ణ గారు నెక్స్ట్ సీన్‌కి..

అయితే సీక్వెల్ ని మాత్రం.. అడివి శేష్ తో తెరకెక్కించి ఒక కాప్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశారు. అయితే ఇలా ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ అవ్వడానికి విశ్వక్ చెప్పిన ‘నో’ కారణమైంది. విశ్వక్ ‘హిట్ 2’కి నో చెప్పడం వెనుక ఉన్న కారణం ఏంటంటే.. ఆ సమయంలోనే ‘పాగల్’ మూవీకి ఓకే చెప్పారట. ఆ సినిమాతో విశ్వక్ మరో కొత్త దర్శకుడిని పరిచయం చేశారు.

అదే సమయంలో శైలేష్ వచ్చి హిట్ 2 గురించి చెప్పి విశ్వక్ ని డేట్స్ అడిగారట. దానికి విశ్వక్ బదులిస్తూ.. ”నీకు లాగానే పాగల్ డైరెక్టర్ కూడా కొత్త వాడు. ఇప్పుడు ఆ సినిమాని ఆపితే తాను ఇబ్బందులు పడతాడు. అది పూర్తి అయిన తరువాత వచ్చి హిట్ 2 చేస్తా, లేదు అనుకుంటే నీఇష్టం” అని శైలేష్ తో చెప్పారట.

ఇక విశ్వక్ డేట్స్ ఇవ్వకపోవడంతో.. హిట్ 2ని అడివి శేష్ తో తెరకెక్కించారు. 2022లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే విశ్వక్ నో చెప్పడం మంచికే అయ్యింది. ఎందుకంటే, అడివి శేష్ ఎంట్రీ ఇవ్వడంతో.. హిట్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మూడో భాగంలో నాని హీరోగా కనిపించబోతున్నారు.