Subhalekha Sudhakar : సోషల్ మీడియాలో ఫేక్ వార్తల వల్ల నా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడింది

శుభలేఖ సుధాకర్ రీసెంట్‌గా యాత్ర 2 లో నటించారు. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వల్ల తమ కుటుంబం ఎదుర్కున్న ఇబ్బందుల గురించి మాట్లాడారు.

Subhalekha Sudhakar : సోషల్ మీడియాలో ఫేక్ వార్తల వల్ల నా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడింది

Subhalekha Sudhakar

Subhalekha Sudhakar : శుభలేఖ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా పేరు తన పేరుకి ముందు స్థిరపరుచుకున్న నటులు శుభలేఖ సుధాకర్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరుగులేని నటుడుగా పేరు తెచ్చుకున్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజ, శుభలేఖ సుధాకర్ భార్యాభర్తలు అని అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా మీడియాతో మాట్లాడిన శుభలేఖ సుధాకర్ సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ వార్తల వల్ల తమ కుటుంబం చాలా ఇబ్బందులు పడిందంటూ ఎమోషనల్ అయ్యారు.

Vishwak Sen – Adivi Sesh : విశ్వక్ సేన్ చేయాల్సిన సినిమా.. అడివి శేష్ చేశాడు.. ఏదో తెలుసా..?

శుభలేఖ సుధాకర్ 1982 లో ‘శుభలేఖ’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. రెండు జెళ్ల సీత, మంత్రి గారి వియ్యంకుడు వంటి సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత సితార, ప్రేమించు పెళ్లాడు, అన్వేషణ, ముద్దుల మనవరాలు, గౌతమి, అహ నా పెళ్లంట, నిర్ణయం వంటి సినిమాలతో పాటు గతేడాది భగవంత్ కేసరి, రామ్, గేమ్ ఆన్, తాజాగా రిలీజైన యాత్ర2 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన శుభలేఖ సుధాకర్ సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌లో వస్తున్న కొన్ని ఫేక్ వీడియోల వల్ల తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి మాట్లాడారు.

33 సంవత్సరాలుగా తను శైలజ విడిపోయామని సోషల్ మీడియాలో రాస్తూనే ఉన్నారని.. ఆ విషయంపై ఇద్దరు పర్సనల్ ఇంటర్వ్యూల్లో, పక్క పక్కన కూర్చుని మాట్లాడినప్పుడు కూడా  క్లారిటీ ఇచ్చామని సుధాకర్ అన్నారు. అయినా ఇప్పటికీ అదే రాతలు రాస్తున్నారని సుధాకర్  ఆవేదన వ్యక్తం చేసారు. ఒకానొక సందర్భంలో తన తల్లి ‘శైల నువ్వు బాగానే ఉన్నారా?’ అని ప్రశ్నించారని.. అలాంటిదేమీ లేదని నేను చెప్పిన మర్నాటి ఉదయం అమ్మ కాలం చేసారని.. ఆవిడ మనసులో భయం, లేదా అనుమానం పెట్టుకుని చనిపోయారా?  అనే బాధ ఇప్పటికీ తనలో ఉందని సుధాకర్ చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తనపై, తన భార్యపై పెద్దగా ప్రభావం చూపించకపోయినా తన కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతాయి కదా అని ప్రశ్నించారు. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన సందర్భంలో కూడా చిరంజీవి తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని రాసారని.. నిజానికి 54 రోజుల పాటు ప్రతిరోజు చిరంజీవి తనకు ఫోన్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేవారని సుధాకర్ చెప్పారు.

Samantha : సమంత లేటెస్ట్ ఫొటోలు చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..

ఈ మధ్య వీడియోల్లో తను చనిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయని.. ఇలాంటి వార్తలు రాయడం వల్ల ఏం కలిసి వస్తుందని సుధాకర్ ప్రశ్నించారు. శరీరం అమ్ముకుని బతికే స్త్రీలకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయని అంతకంటే దారుణంగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇలాంటి వీడియోలు చేసేవారు ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారంటూ తీవ్రమైన ఆవేదనతో శుభలేఖ సుధాకర్ మాట్లాడారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.