మ్యానిఫెస్టోపై కీలక ప్రకటన చేస్తారా? రాప్తాడు సభలో జగన్ ప్రసంగంపైనే అందరి దృష్టి.. పర్యటన షెడ్యూల్ ఇలా

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అనంతరంపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు వద్ద సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

మ్యానిఫెస్టోపై కీలక ప్రకటన చేస్తారా? రాప్తాడు సభలో జగన్ ప్రసంగంపైనే అందరి దృష్టి.. పర్యటన షెడ్యూల్ ఇలా

CM Jagan

CM Jagan Public Meeting In Raptadu : సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు వద్ద 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సిద్ధం బహిరంగ సభలో పాల్గోనున్నారు. సిద్ధం సభలో జగన్ ప్రసంగంపైనే అందరి దృష్టి నెలకొంది. ఎన్నికల మ్యానిఫెస్టోపై జగన్ ఏమైనా మాట్లాడతారా అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో పై ఈ సభలో సీఎం మాట్లాడతారని మంత్రి పెద్దిరెడ్డి ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. భీమవరం, దెందులూరు, తరువాత రాయలసీమలో సిద్ధం బహిరంగ సభను వైసీపీ నిర్వహిస్తోంది. ఈ సభకు రాయలసీమలో 49 నియోజకవర్గాల నుంచి భారీగా వైసీపీ కార్యకర్తలను తరలించేందుకు ఆ పార్టీ నేతలు చర్యలు చేపట్టారు. ఈ సభకు దాదాపు 5లక్షల మంది హాజరవుతారని అంచనా. మధ్యాహ్నం 3గంటలకు సిద్ధం సభా వేదిక వద్దకు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు పర్యటన ముగించుకొని తిరిగి విజయవాడకు బయలుదేరి జగన్ వెళ్తారు.

Also Read : CM Jagan : ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం.. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడాలన్న జగన్

  • సీఎం పర్యటన సాగేదిలా..
    గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకుంటారు.
    2.55 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 3.15గంటలకు రాప్తాడుకు చేరుకుంటారు.
    మధ్యాహ్నం 3.20 గంటలకు హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వద్దకు చేరుకుంటారు.
    3.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు.
    సాయంత్రం 5.15 గంటలకు బహిరంగ సభా ప్రాంగణం నుంచి బయలుదేరి వెళ్తారు.
    పుట్టపర్తి విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి రాత్రి 7గంటల వరకు చేరుకుంటారు.