Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు.. విచారణకు రావాలని కోర్టు నోటీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది.

Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు.. విచారణకు రావాలని కోర్టు నోటీసులు

Pawan Kalyan

Criminal Case Registered Against Pawan Kalyan : ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. గత సంవత్సరం జూలై 9న వలంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ పిటీషన్ పై విచారించిన గుంటూరు కోర్టు పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. విచారణ నిమిత్తం నాలుగో అదనపు జిల్లా కోర్టుకు కేసును బదిలీ చేసింది. మార్చి 25న పవన్ కల్యాణ్ విచారణకు హాజరు కావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు నోటీసులిచ్చారు.

Also Read : మ్యానిఫెస్టోపై కీలక ప్రకటన చేస్తారా? రాప్తాడు సభలో జగన్ ప్రసంగంపైనే అందరి దృష్టి.. పర్యటన షెడ్యూల్ ఇలా

పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి యాత్ర గతేడాది జూలై9న ఏలూరులో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ వలంటీర్ వ్యవస్థపై పలు ఆరోపపణలు చేశారు. రాష్ట్రంలో 29వేల నుంచి 30వేల మంది వరకు అమ్మాయిలు అదృశ్యం అయ్యారని, వారిలో 14వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలిన వారి గురించి సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతిఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంత మంది సంఘ విద్రోహశక్తుల ద్వారా వలవేసి అపహరిస్తున్నారని పవన్ ఆ సభలో ఆరోపించారు.

Also Read : ఈ నియోజకవర్గం టీడీపీకి అచ్చిరావడం లేదా? ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనుంది?

పవన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసింది. విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం పలు సెక్షన్ల కింద పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. విచారణకు నాల్గో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేయడంతో.. న్యాయమూర్తి శరత్ బాబు పవన్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.