Teja Sajja : ఇది కదా సక్సెస్ అంటే.. మహేష్ బాబు ఒకప్పుడు.. ఇప్పుడు తేజ సజ్జనే.. వీడియో వైరల్..

తాజాగా తేజ సజ్జకి సంబంధించిన ఓ వైరల్ అవుతున్న వీడియో చూసి ఆడియన్స్ అంతా.. సక్సెస్ అంటే ఇది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Teja Sajja : ఇది కదా సక్సెస్ అంటే.. మహేష్ బాబు ఒకప్పుడు.. ఇప్పుడు తేజ సజ్జనే.. వీడియో వైరల్..

Hanuman star Teja Sajja craze in lady audience over mahesh babu

Teja Sajja : టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ.. రీసెంట్ గా ‘హనుమాన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ రిలీజ్ కి ముందు చిన్న సినిమా అని, చిన్న హీరో అని.. సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ మూవీ రిలీజైన తరువాత.. చిన్న సినిమా, చిన్న హీరో కాస్త పాన్ ఇండియా మార్క్‌ని సొంతం చేసుకున్నారు.

హనుమాన్ మూవీతో పాటు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే హనుమాన్, గుంటూరు కారం మించిన కలెక్షన్స్ ని అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తేజ సజ్జ సక్సెస్ చూసి ప్రతి ఒక్కరు అభినందించారు. అయితే తాజాగా తేజ సజ్జకి సంబంధించిన ఓ వైరల్ అవుతున్న వీడియో చూసి.. అసలు సక్సెస్ అంటే ఇది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. ప్రముఖ తెలుగు డాన్స్ షో ‘ఢీ’లో డాన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అమ్మాయి ‘భూమిక’. ప్రస్తుతం ఈ భామ శేఖర్ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా చేస్తుంది. తాజాగా శేఖర్ మాస్టర్ నిర్మాణంలో ఒక మ్యూజిక్ వీడియోలో డాన్సర్ గ్రీష్మతో కలిసి భూమిక చిందేసింది. ఇటీవలే ఈ సాంగ్ ని కూడా రిలీజ్ చేసారు. ఇక ఈ సాంగ్ లో నటించిన ఇద్దరు డాన్సర్స్ గ్రీష్మ, భూమిక ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో భూమికని.. నువ్వు ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నావు అని అడిగారు. “ఒకప్పుడు అయితే మహేష్ బాబు. కానీ ఇప్పుడు మాత్రం తేజ సజ్జ” అని చెప్పుకొచ్చింది. మహేష్ బాబు అంటే తనకి ఒకప్పటి క్రష్ అని, కానీ హనుమాన్ చూసిన తరువాత నుంచి తేజ తన క్రష్ గానే కాదు లవర్ గా కూడా మారిపోయాడని చెప్పుకొచ్చింది. తేజ పై తనకి ట్రూ లవ్ ఉందని చెబుతూ.. ఐ లవ్ యు అంటూ ఇంటర్వ్యూ ద్వారా ప్రపోజ్ చేసింది. ఈ వీడియోని తేజ సజ్జ వరకు వెళ్లాలంటూ కోరుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by poley adiripoley (@poley_adiripoley)