iQOO Neo 9 Pro Launch : ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 22నే లాంచ్.. ధర, స్పెషిఫికేషన్లు లీక్..!

iQOO Neo 9 Pro Launch : భారత మార్కెట్లో ఈ నెల 22న ఐక్యూ నియో 9 ప్రో లాంచ్ కానుంది. రాబోయే ఐక్యూ నియో ఫోన్ ధర రూ. 40వేల లోపు ఉంటుంది. అమెజాన్ కూడా చాలా స్పెషిఫికేషన్లను వెల్లడించింది. పూర్తి వివరాలివే

iQOO Neo 9 Pro Launch : ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 22నే లాంచ్.. ధర, స్పెషిఫికేషన్లు లీక్..!

iQOO Neo 9 Pro India launch this week: Price, specs and other leaked details

iQOO Neo 9 Pro Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఐక్యూ నుంచి నియో 9 ప్రో మోడల్ మరో రెండు రోజుల్లో లాంచ్ కానుంది. దేశ మార్కెట్లో ఫిబ్రవరి 22న లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. రాబోయే ప్రీమియం ఫోన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లను అమెజాన్ ద్వారా ఇప్పటికే వెల్లడించింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు కొన్ని రోజుల ముందు భారత్ ధర కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. రాబోయే ఐక్యూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Paytm FAQs : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మార్చి 15 తర్వాత ఏ సర్వీసు పనిచేస్తుంది? ఏది పనిచేయదంటే? అన్ని ప్రశ్నలకు సమాధానాలివే!

ఐక్యూ నియో 9 ప్రో భారత్ ధర (లీక్) :
ఐక్యూ నియో 7 ప్రో ఫోన్ ప్రారంభ ధర రూ. 34,999తో అందుబాటులో ఉంది. ఐక్యూ నియో 9 ప్రో ధర రూ. 40వేల లోపు ఉండవచ్చు. రాబోయే ఐక్యూ ఫోన్ ధర రూ. 37,999, రూ. 3వేలు, బ్యాంక్ ఆఫర్‌తో వినియోగదారులు రూ. 34,999 ధరతో కొనుగోలు చేయొచ్చు.

ఐక్యూ నియో 9 ప్రో : స్పెషిఫికేషన్లు :
డిజైన్ :
ఐక్యూ నియో 9 ప్రో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. డివైజ్ డ్యూయల్ టోన్ లుక్‌తో బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్‌ని కలిగి ఉంది. రెడ్ కలర్ మోడల్ చూసేందుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చేతికి చాలా బాగుంది. లెదర్ ఎండ్ ఫోన్‌పై మంచి గ్రిఫ్ అందిస్తుంది. అదనపు ప్రొటెక్షన్‌కు ఫోన్ కేసును ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. బ్యాక్ సైడ్ రెండు పెద్ద కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి.

డిస్‌ప్లే, చిప్‌సెట్ :
అమెజాన్ ప్రకారం.. ఐక్యూ నియో 9 ప్రో మోడల్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1.5కె రిజల్యూషన్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఐక్యూ నియో 9 ప్రో చిప్ మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీని ఉపయోగిస్తోంది. 2023 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు శక్తినిస్తుంది.

కెమెరా :
50ఎంపీ సోనీ ఐఎంఎక్స్920 ప్రైమరీ కెమెరా, 8ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరాతో సహా వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయని అధికారిక టీజర్‌లు ధృవీకరించాయి. ఈసారి, కంపెనీ కొత్త వెర్షన్‌లో మూడో కెమెరాను అందించనుంది. ఐక్యూ నియో 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో మాక్రో కెమెరా తొలగించింది. కానీ, 2ఎంపీ సెన్సార్‌లు క్వాలిటీ పరంగా పరంగా పెద్దగా ఉన్నాయి.

బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ :
హుడ్ కింద 5,160ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. ఐక్యూ 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది. కంపెనీ ఫోన్‌లలో బాక్స్‌లో ఛార్జర్‌ని అందిస్తోంది.

Read Also : Neuralink : న్యూరాలింక్ ప్రయోగంలో మరో ముందడుగు.. బ్రెయిన్ చిప్ వ్యక్తి ఆలోచనలతో కంప్యూటర్ మౌస్ కంట్రోల్ చేయగలడు : ఎలన్ మస్క్