Banana Tissue Culture Techniques : తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న టిష్యూకల్చర్ అరటి సాగు యాజమాన్యం

Banana Tissue Culture Techniques : ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే చెరకుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు తక్కువగా వుండటం, పెరుగుతున్న చీడపీడలు వంటి పలు కారణాల వల్ల రైతులు అధిక కార్శీలు చేయటానకి ఇష్టపడుతున్నారు.

Banana Tissue Culture Techniques : తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న టిష్యూకల్చర్ అరటి సాగు యాజమాన్యం

Banana Tissue Culture Techniques

Banana Tissue Culture Techniques : తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల హెక్టార్లలో సాగుచేయబడుతున్న వాణిజ్యపంట చెరకు. ఇప్పటికే క్రొత్తగా మొక్కతోటలు నాటిన ప్రాంతాలలో పైరు నెలరోజుల వయస్సులో వుంది.  మొక్కతోటలు నరికిన రైతాంగం తిరిగి కార్శీ చేయటం సర్వసాధారణం. మొక్కతోటలతో పోలిస్తే కార్శీతోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలావరకు కలిసొస్తుంది. అయితే కార్శీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వల్ల దిగుబడులు నాశిరకంగా వుంటున్నాయి. మొక్కతోటలకు ధీటుగా రెండవ పంట నుంచి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలంటున్నారు శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డి నేటర్ డా. డి చిన్నమనాయుడు.

Read Also : Mirchi Cultivation : మిరపను ఆశించే పూత పురుగు నివారణ

చెరకు సాగులో… నాటిన మొదటి సంవత్సరంలో కంటే,  రెండవ సంవత్సరంలో చేపట్టే కార్శితోటల సాగు రైతుకు లాభదాయకంగా వుంటుంది. కార్శిసాగులో విత్తనం ఖర్చు, భూమి తయారీ వంటి ఖర్చులు వుండవు కనుక ఎకరాకు 15వేల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. గతంలో మొక్కతోటలు ఎక్కువ విస్తీర్ణంలోను కార్శీలు తక్కువగాను వుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే చెరకుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు తక్కువగా వుండటం, పెరుగుతున్న చీడపీడలు వంటి పలు కారణాల వల్ల రైతులు అధిక కార్శీలు చేయటానకి ఇష్టపడుతున్నారు.

టిష్యూకల్చర్ అరటి సాగులో మెళకువలు : 
ఎంతలా అంటే.. క్రొత్తగా నాటే మొక్కతోటల విస్తీర్ణం 36 శాతం వుంటే కార్శీతోటల విస్తీర్ణం 64 శాతం వుందని శాస్ర్తవేత్తల అంచనా. తెలుగురాష్ర్టాలలో చెరకు సాగు విస్తీర్ణం ఎక్కువగానే వున్నా, సరాసరి ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా వుంది. ఇందుకు గల ప్రధాన కారణం మొక్కతోటల్లో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న రైతాంగం… కార్శీతోటలను నిర్లక్షం చేయటం వల్ల దిగుబడులు నామమాత్రంగా నమోదవుతున్నాయి. కార్శీతోటల్లో కూడా మొక్కతోటలకు ధీటుగా దిగుబడులు సాధించాలంటే  తప్పనసరిగా కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డి నేటర్ డా. డి చిన్నమనాయుడు.

కార్శీ చేసే రైతులు పోషకయాజమన్యం పట్ల కూడా కొంత అవగాహణతో ముందుకు వెళ్ళాలి. సాధారణంగా మొక్కతోటలు నాటే సమయంలో భూమిలో బస్తాలకొద్దీ ఎరువులను గుమ్మరించే మన రైతాంగం కార్శీ తోటల్లో మాత్రం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వుంటారు. దీనివల్ల మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందక… తొందరగా చీడపీడలకు లొంగిపోయి, దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. కార్శీతోటల్లో కూడా సిఫారసు చేసిన ఎరువుల మోతదాను తప్పకుండా అందించాలంటారు శాస్ర్తవేత్త.

Read Also : Corn Cultivation Tips : మొక్కజొన్న నిల్వల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు