వైసీపీలో ఏమైనా జరగొచ్చు, గెలిచే సీటుని వదిలేసుకోవడం కరెక్ట్ కాదు- టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కీలక వ్యాఖ్యలు

రెండు మూడు రోజుల్లో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని జలీల్ ఖాన్ వెల్లడించారు.

వైసీపీలో ఏమైనా జరగొచ్చు, గెలిచే సీటుని వదిలేసుకోవడం కరెక్ట్ కాదు- టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కీలక వ్యాఖ్యలు

Jaleel Khan : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు రోజుల నుంచి కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని, అందుకే వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిసినట్లు చెప్పారాయన. ఆయనను కలవడం తప్పా అంటూ ప్రశ్నించారు. మైనార్టీలకు అన్యాయం జరిగితే ఆ ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాపై పడుతుందన్నారు జలీల్ ఖాన్.

గెలిచే సీటుని పొత్తులో భాగంగా వదిలేసుకోవడం సరికాదని, తనకు సీటు ఇస్తే వ్యక్తిగత ఇమేజ్ తో అయినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు జలీల్ ఖాన్. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని టీడీపీ హైకమాండ్ తనకు కబురు చేసిందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని జలీల్ ఖాన్ వెల్లడించారు.

”వైసీపీలో సీట్లు ఖాయమైనా చివరిదాకా వారే ఉంటారనే గ్యారంటీ లేదు. ఆఖరి నిమిషంలో మార్పులు ఉంటాయి. ఇంఛార్జి పదవి ఇచ్చినంత మాత్రాన అభ్యర్థి కాదు. ఇవాళ ఉన్న సర్వే రేపు ఉండదు. గెలిచే వారికి టికెట్ ఇవ్వాలి. పవన్ కూడా స్ట్రైక్ రేట్ 80శాతం ఉండాలంటున్నారు. ఆ మాట మీద నాకు సహకరిస్తారని అనుకుంటున్నా. చంద్రబాబు పిలుపుతో మంత్రి పదవి అవకాశం వదిలేసుకొని టిడిపిలో చేరా. రెండు మూడు రోజుల నుంచి నాపై కార్యకర్తల ఒత్తిడి ఎక్కువగా ఉంది. అందుకే అయోధ్య రామి రెడ్డిని కలిశా.

అయోధ్య రామిరెడ్డి కలవడం తప్పా? నేను వైసీపీ కండువా ఏమైనా కప్పుకున్నానా? ఊరికే కలిశా? గెలిచే సీటుని పొత్తులో భాగంగా వదిలేసుకోవడం సరికాదు. మైనార్టీలకు అన్యాయం జరిగితే ఆ ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాపై పడుతుంది. నాకు సీటు ఇస్తే వ్యక్తిగత ఇమేజ్ తో అయినా గెలుస్తా. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని టీడీపీ హైకమాండ్ కబురు చేసింది. రెండు మూడు రోజుల్లో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా” అని జలీల్ ఖాన్ చెప్పారు.

Also Read : సీఎం జగన్‌ వ్యూహం ఏంటి? ఎన్నికల్లో గెలుపు స్కెచ్‌ ఎలా ఉండబోతోంది