Viral video : ఏం చెప్పావురా..? దెబ్బ‌కు ప్యూజులు ఔట్ అయ్యాయి! షాహీన్ స‌మాధానానికి షాకైన అమీర్‌

షాహీన్ స‌మాధానం వినీ అమీర్ షాక్ అయ్యాడు.

Viral video : ఏం చెప్పావురా..? దెబ్బ‌కు ప్యూజులు ఔట్ అయ్యాయి! షాహీన్ స‌మాధానానికి షాకైన అమీర్‌

Mohammad Amir was shocked to hear Shaheen Afridi's answer

Mohammad Amir – Shaheen Afridi : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. స‌మ‌కాలిన క్రికెట్‌లో అత‌డి కంటే స్టార్ ఆట‌గాడు ఎవ‌రు లేర‌నేది క్రికెట్ విశ్లేష‌కుల అభిప్రాయం. అయితే.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబార్ ఆజాం కూడా టాలెంట్ ఉన్న ఆట‌గాడే. కాగా.. గత కొంత‌కాలంగా ఈ ఇద్ద‌రు క్రికెట‌ర్లను పోల్చుతున్నారు. కొంద‌రు కోహ్లి గొప్ప‌వాడు అంటే మ‌రికొంద‌రు బాబ‌ర్ ఆజాం అని అంటుంటారు.

ఎవ‌రు ఏమ‌ని అనుకుంటున్న‌ప్ప‌టికీ ఇలా ఈ ఇద్ద‌రిని ఒక‌రితో ఒక‌రిని పోల్చ‌డం త‌గ‌ద‌ని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఒక‌రు ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌గా మ‌రొక‌రు ఇప్పుడిప్పుడే త‌న కెరీర్‌లో ఎదుగుతున్న ఆట‌గాడిని అంటుంటారు. అయితే.. సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో పాకిస్తాన్ సీనియ‌ర్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్ వెట‌ర‌న్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్‌, పేస‌ర్ షాహీన్ అఫ్రీదిల‌ను ఇంట‌ర్య్వూ చేశాడు.

IND vs ENG 4th test : రాంచీ టెస్టు.. క్లీన్‌బౌల్డ్ అయినా నాటౌట్‌గా జాక్ క్రాలే.. ఏంటి సామీ ఇది

ఈ ఇంట‌ర్వ్యూలో కోహ్లి, బాబ‌ర్ క‌వ‌ర్ డ్రైవ్‌ల‌లో మీరు ఎవ‌రిది ఇష్ట‌ప‌డ‌తార‌ని ప్ర‌శ్నించాడు. ఇక కోహ్లి త‌న ఫేవ‌రెట్ ఆట‌గాడు అని ఎప్పుడు చెబుతుంటే అమీర్‌.. విరాట్‌కే ఓటు వేయ‌గా షాహీన్ త‌న స‌హ‌చ‌రుడికి విధేయంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అత‌డు బాబ‌ర్ ఆజాంకు ఓటు వేశాడు. షాహీన్ స‌మాధానం వినీ అమీర్ షాక్ అయ్యాడు. దీంతో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

కోహ్లి లేదా బాబ‌ర్ ఆజాం ఇద్ద‌రిలో ఎవ‌రి కెప్టెన్సీలో ఆడాల‌ని అనుకుంటున్నారు అని అడుగ‌గా.. వెంట‌నే అమీర్.. టీమ్ఇండియా స్టార్ కోహ్లి కెప్టెన్‌లో ఆడాల‌ని ఉంద‌ని స‌మాధానం చెప్పాడు.

Delhi Capitals : ఇది గ‌మ‌నించారా? ఢిల్లీ మ్యాచులు విశాఖ‌లో ? పంత్ మెరుపులు చూడొచ్చు!

ఇదిలా ఉంటే.. ఫిబ్ర‌వ‌రి 15న కోహ్లి భార్య అనుష్క శ‌ర్మ పండంటి మగ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. అత‌డికి అకాయ్ అని పేరు పెట్టారు. ఇప్ప‌టికే విరుష్క దంప‌తుల‌కు వామిక అనే అమ్మాయి ఉన్న సంగ‌తి తెలిసిందే.