దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్.. మోదీ హయాంలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులు..

Narendra Modi: ఈ తొమ్మిదేళ్లలో మోదీ సర్కార్ చేపట్టినన్నీ పెద్ద ప్రాజెక్టులు గతంలో ఏ సర్కార్ చేపట్టలేదు. గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులను..

దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్.. మోదీ హయాంలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులు..

Narendra Modi

ఇంతకుముందు ఒక లెక్క. ఇప్పుడు మరో లెక్క. 2014కు ముందు భారత్ వేరు.. 2024లో భారత్ వేరు. ఇది నయా భారత్.. నమో భారత్. శత్రుదేశాలకు దీటుగా సమాధానం చెప్పడమే కాదు.. దేశాన్ని అన్నిరంగాల్లో డెవలప్ చేస్తూ.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ప్రధాని మోదీ.

మౌలిక వసతులపై స్పెషల్ ఫోకస్ పెట్టి మిషన్ మోడ్ లో ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్నారు. అటల్ సేతు, సుదర్శన్ సేతు, అస్సాం, కశ్మీర్ లో అండర్ టన్నెల్స్ నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే లక్షల కోట్లు ఖర్చుతో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ చేస్తోంది నమో సర్కార్.

నయా భారత్.. నయా థాట్. మరో 20 ఏళ్లలో దేశ గతి మారిపోవాలి. ఇవాళ్టి పునాదులు రేపటి తరానికి మార్గం సుగమం చేయాలి. ఇదే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ప్రధాని మోడీ. భారత్ ను పటిష్టమైన దేశంగా తయారు చేసేందుకు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ప్రపంచదేశాలకు ధీటుగా.. ప్రత్యేకంగా చైనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కునేలా మౌలిక వసతుల అభివృద్ధిపైనే ఫోకస్ చేశారు. ఉచితాలు, వృథా ఖర్చులు, ఆడంబారాల జోలికి వెళ్లకుండా.. మౌలిక వసతులతో దేశ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులు
ఈ తొమ్మిదేళ్లలో మోదీ సర్కార్ చేపట్టినన్నీ పెద్ద ప్రాజెక్టులు గతంలో ఏ సర్కార్ చేపట్టలేదు. గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులను చేపట్టడమే కాదు.. వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. బడ్జెట్ లో ఎక్కువ మొత్తం మౌలిక వసతులకే కేటాయిస్తూ వచ్చారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, వంతెనలు, అండర్ టన్నెల్స్ నిర్మాణం చేపట్టి ఉజ్వల భవిష్యత్ కు దారి వేస్తున్నారు మోదీ. 2024-2030 మధ్య మౌలిక వసతుల కల్పనపైనే 143 ట్రిలియన్లు పెట్టుబడి పెట్టబోతున్నారు.

EVలు, సోలార్, విండ్, హైడ్రోజన్ ప్రాజెక్టులపై కూడా పెట్టుబడులను స్పీడప్ చేసింది నమో సర్కార్. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అటల్ టన్నెల్, ధోలా-సాదియా బ్రిడ్జి, చీనాబ్ రివర్ బ్రిడ్జ్ వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. వాతావరణం, స్థానిక పరిస్థితులు ప్రతికూలకంగా ఉన్నా కూడా కనెక్టివిటీ పెంచింది కేంద్రప్రభుత్వం.

ఖర్చు భారీగా..
రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెడుతోన్న ఖర్చు కూడా గత ఐదేళ్లలో భారీగా పెరుగుతూ వస్తోంది. హైస్పీడ్ రైల్ లైన్లు, కొత్త కారిడార్ల అభివృద్ధి కనెక్టివిటీని మరింత పెంచుతున్నాయి. 2030 నాటికి 23 జలమార్గాలను అమలు చేసి.. 35 మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. అమెరికాతో సరిపోలేలా దేశంలో మౌలిక సదుపాయాలపైనే ఫోకస్ పెట్టింది నమో సర్కార్. మిషన్ మోడ్లో పనులు పూర్తి చేస్తోంది.

కైలాష్ మానస సరోవర్ హైవే ప్రాజెక్టును దాదాపు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవడంతో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లే యాత్రికులు ప్రమాదకరమైన ఎత్తైన భూభాగం ద్వారా కష్టతరమైన ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దేశంలోని 580 జిల్లాలను కలుపుతూ దాదాపు 35వేల కి.మీ జాతీయ రోడ్డు కారిడార్లను అభివృద్ధి చేయడానికి భారతమాల పేరుతో ప్రాజెక్టు చేపడుతోంది మోదీ సర్కార్.

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన
దేశంలో మిషన్ మోడ్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్న దానికి మరో ప్రత్యేక ఉదాహరణ సుదర్శన సేతు. గుజరాత్ లో నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. 2.32 కిలోమీటర్లు పొడవైన ఈ బ్రిడ్జిని..దాదాపు 980 కోట్లతో నిర్మించారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ప్రత్యేకమైన డిజైన్‌తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు.

ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి భక్తులు పడవపైనే ఆధారపడేవారు. దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్‌లో నివసిస్తున్న దాదాపు 8వేల 5వందల మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మణిహారంలా దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ అటల్ సేతును నిర్మించారు. ఈ అటల్ సేతు వంతెన పొడవు మొత్తం. 21.8 కిలోమీటర్లు. ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే కట్టారు. 21వేల కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. గతంలో సేవ్రీ నుంచి నవా షేవాకు 2 గంటల సమయం పట్టగా.. ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం 20 నిమిషాల్లోనే సేవ్రీ నుంచి నవా షేవాకు చేరుకుంటున్నారు.

Also Read: టెన్షన్‌లో టీడీపీ సీనియర్లు, సీటుపై క్లారిటీ ఇవ్వని చంద్రబాబు.. కారణం అదేనా?