Sharwa35 : శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది..

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న 35వ చిత్రం టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.

Sharwa35 : శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది..

Sharwanand KrithiShetty new movie Sharwa35 titled as Manamey

Sharwa35 : శర్వానంద్ రెండేళ్ల క్రిందట ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన 35వ చిత్రాన్ని అనౌన్స్ చేసారు. అయితే మధ్యలో శర్వా తన ఎంగేజ్మెంట్, మ్యారేజ్ పనుల్లో పడడంతో.. ఆ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ ని నేడు అనౌన్స్ చేసారు.

Also read : Nivetha Pethuraj : నేను, నా కుటుంబం ఒత్తిడిలో ఉన్నాం.. తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి.. హీరోయిన్ సంచలన పోస్ట్..

ఈ చిత్రానికి ‘మనమే’ అనే క్లాసీ టైటిల్ ని ఖరారు చేసారు. ఇక ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ లో శర్వానంద్, హీరోయిన్ కృతిశెట్టిని, అలాగే ఒక చిన్న పాపని చూపించారు. మరి ఈ సినిమా కథ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఉండబోతుందా..? లేదా ఇంకో కొత్త పాయింట్ తో రాబోతోందా అనేది చూడాలి. టైటిల్ అండ్ గ్లింప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలాగానే ఉన్నాయి.

ఇక ఈ సినిమాలోని చాలా భాగం కథ లండన్ లోనే జరగనుందని తెలుస్తుంది. మెలోడీ మెజీషియన్ హేశం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు ఎప్పుడు తీసుకు రాబోతున్నారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.