Sharwanand : శర్వానంద్ బర్త్ డే అప్డేట్స్.. మూడు సినిమాలు మూడు డిఫరెంట్ రోల్స్..

నేడు శర్వానంద్ బర్త్ డే సందర్భంగా.. ఈ హీరో నటిస్తున్న కొత్త సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి. వాటి వైపు ఓ లుక్ వేసేయండి.

Sharwanand : శర్వానంద్ బర్త్ డే అప్డేట్స్.. మూడు సినిమాలు మూడు డిఫరెంట్ రోల్స్..

Sharwanand new movie updates on his birthday occasion

Sharwanand : నేడు మార్చి 6న శర్వానంద్ బర్త్ డే కావడంతో.. ఈ హీరో నటిస్తున్న కొత్త సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి. ప్రస్తుతం శర్వా చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి లాస్ట్ స్టేజి ఉండగా.. మరో రెండు సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ మూడు సినిమాల్లో కూడా శర్వానంద్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. మరి ఆ రోల్స్ వైపు ఓ లుక్ వేసేయండి.

శర్వానంద్ తన 35వ సినిమాని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం శర్వా పెళ్లి వల్ల లేట్ అయ్యింది. ఇక ఇప్పుడు రిలీజ్ కి సిద్దమవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఓ చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాకి ‘మనమే’ అనే క్లాసీ టైటిల్ ని పెట్టారు. గ్లింప్స్ చూస్తుంటే శర్వా ఫాదర్ రోల్ చేస్తున్నారా అనే సందేహం కలుగుతుంది.

Also read : GAMA Awards : దుబాయ్‌లో అంగరంగ వైభవంగా గామా అవార్డ్స్.. విజేతల ఫుల్ లిస్టు ఇదే..

ఇక 36వ సినిమాని తన స్నేహితుడు నిర్మాణంలో చేస్తున్నారు శర్వానంద్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేస్తున్నారు. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రంలో శర్వా.. బైక్ రేసర్ గా కనిపించబోతున్నారు. మాళవిక నాయర్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

దీని తరువాత 37వ సినిమాని ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేయబోతున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం పై ఈ సినిమా రూపొందబోతుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన శర్వా టెస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఆ లుక్ చూస్తుంటే సామజవరగమన మూవీలా మిడిల్ క్లాస్ అబ్బాయి కథ అని అనిపిస్తుంది.