Game Changer : ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ పై దిల్ రాజు కామెంట్స్.. రామ్ చరణ్ బర్త్ డేకి..

'లవ్ మీ' టీజర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ని ఇచ్చారు.

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ పై దిల్ రాజు కామెంట్స్.. రామ్ చరణ్ బర్త్ డేకి..

Dil Raju gave Ram Charan Game Changer update at Love Me Teaser Launch Event

Game Changer : శంకర దర్శకత్వంలో రామ్ చరణ్ మూడేళ్లగా చేస్తూ వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి మాత్రం ఒక అప్డేట్ కూడా ఇవ్వకుండా ఫ్యాన్స్ ని బాధ పెడుతూ వస్తున్నారు. ఒక చిన్న అప్డేట్ కోసం సోషల్ మీడియాలో దిల్ రాజుని చరణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటూ ఉంటారు.

అయితే ఫైనల్లీ ఒక క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి దిల్ రాజు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే తెలియజేసారు. ఈరోజు ‘లవ్ మీ’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ అప్డేట్ ని ఇచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ.. “గేమ్ ఛేంజర్ అప్డేట్ అడుగుతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్. చరణ్ గారి పుట్టినరోజు నాడు ఒక క్రేజీ అప్డేట్ రాబోతుంది సిద్ధంగా ఉండండి” అంటూ వ్యాఖ్యానించారు.

Also read : Mahesh Babu : మహేష్ బాబు కొత్త లుక్ చూసారా.. లేజర్ ఫోకస్ అంటూ..

దీంతో చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ అప్డేట్ ఏంటని మరో చర్చ మొదలయింది. అయితే అప్డేట్ గతంలోనే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన ‘జరగండి జరగండి..’ సాంగ్ అప్డేట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మార్చి 27న ఈ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. కాగా ఈ సాంగ్ ఇప్పటికే లీక్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. అయినాసరే చరణ్ ఫ్యాన్స్ అఫీషియల్ సాంగ్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న వేరియేషన్స్ కనిపించబోతున్నారంటూ రైటర్ బుర్ర సాయి మాధవ్ చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువుగా ఈ సినిమాతో చరణ్ పేరు సంపాదించుకుంటారని చెబుతూ.. మూవీ పై మరిన్ని అంచనాలను క్రియేట్ చేస్తున్నారు.