Vikramarkudu 2 : ‘విక్రమార్కుడు 2’ గురించి నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'విక్రమార్కుడు 2' గురించి టాలీవుడ్ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఆల్రెడీ..
Vikramarkudu 2 : రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ 2006లో చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘విక్రమార్కుడు’. రవితేజ మార్కెట్‌ను, రేంజ్‌ను పెంచిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ చిత్రంలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఒకటి దొంగ పాత్రలో అత్తిలిసత్తిబాబుగా కామెడీ చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తే, మరొకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో విక్రమ్ రాథోడ్ గా అదుర్స్ అనిపించారు.
ఈ సినిమాని తరువాత పలు భాషల్లో అక్కడి హీరోలు రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నప్పటికీ.. ఈ రెండు పాత్రలతో రవితేజ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోయారు. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు రావాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే విజయేంద్రప్రసాద్ సీక్వెల్‌కు కథ కూడా సిద్ధం చేసారు.
అయితే ఈ సీక్వెల్ ని తెరకెక్కించడానికి రాజమౌళి, రవితేజ ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ సీక్వెల్ గత మూడేళ్ళుగా చర్చల్లోనే నిలిచిపోయింది. తాజాగా ఈ సీక్వెల్‌పై భీమా ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ రియాక్ట్ అవుతూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు. విక్రమార్కుడు 2 టైటిల్‌ను మూడేళ్ల క్రితమే తమ బ్యానర్‌పై రిజిస్టర్ చేయించినట్లు రాధామోహన్ చెప్పుకొచ్చారు.
Also read : Kalki 2898 AD : ఇటలీ షూటింగ్ సెట్స్ నుంచి.. ప్రభాస్, దిశా పటాని ఫొటో వచ్చేసింది..
ఇక ఈ మూవీని తెరకెక్కించడానికి దర్శకుడు సంపత్ నందిని కూడా ఫిక్స్ చేసి ఉంచారట. కానీ ఈ సీక్వెల్లో నటించడానికి రవితేజ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆలస్యం అవుతూ వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రవితేజని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు, ఆయన ఒప్పుకుంటేనే సీక్వెల్ మొదలుపెడతామంటూ చెప్పుకొచ్చారు. సరైన కాంబినేషన్ సెట్‌కాకపోతే మాత్రం ఈ సీక్వెల్ ని చేసేది లేదని వెల్లడించారు.
మరి ఈ సీక్వెల్ కి అంతా సెట్ అయ్యి ఆడియన్స్ ముందుకు వస్తుందా..? లేదా చర్చలోనే నిలిచిపోతుందా..? అనేది చూడాలి. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది బాలీవుడ్ మూవీ ‘రైడ్’కి రీమేక్ గా వస్తుంది.