Salman Khan : సల్మాన్ ఖాన్ సీక్రెట్స్ బయటపెట్టిన చిన్ననాటి స్నేహితుడు..
సల్మాన్ ఖాన్ పందిలా తింటాడు అంటూ బాలీవుడ్ నటుడు చేసిన సంచలన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి.. ప్రముఖ నటుడు ‘విందూ దారా సింగ్’ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. విందూ దారా సింగ్, సల్మాన్ కి తోటి నటుడు మాత్రమే కాదు, చిన్ననాటి స్నేహితుడు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ తో తన స్నేహం గురించి, తమ చిన్ననాటి సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.
విందూ దారా సింగ్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “చిన్నతనం నుంచి నేను, సల్మాన్ కలిసే చదువుకున్నాము. అతడిది చాలా మంచి మనసు. సాయం చేయడంలో ముందు ఉంటాడు. తన తండ్రి తనకి డబ్బులిస్తే.. అవి లక్షల్లో ఉన్న వాటిని తన కోసం వాడుకోకుండా వారి ఇంటిలో పని చేసే వాళ్ళకి పంచిపెట్టేసేవాడు. అప్పుడే కాదు సల్మాన్ ఇప్పటికి అలాగే ఉన్నారు. నెలలో దాదాపు 25-30 లక్షల వరకు గుప్తదానాలు చేస్తారు. ఇక సినిమాల్లో ఎంత సంపాదించినా తన పాకెట్ మనీని మాత్రం తన తండ్రి దగ్గరే తీసుకుంటాడు” అంటూ చెప్పుకొచ్చారు.
Also read : Akash Puri : RC ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇస్తున్నా అంటున్న ఆకాష్ పూరి..
ఇక సల్మాన్ ఫుడ్ అండ్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ.. “నేను బరువు ఎక్కడం చూసి సల్మాన్ జిమ్ లో జాయిన్ అయ్యాడు. జిమ్ లోనే ఎక్కువసేపు గడుపుతాడు. అలాని ఫిట్నెస్ కోసం తనకి నచ్చినవి తినకుండా ఉండడు. తిండి విషయంలో ఎటువంటి కంట్రోల్ పెట్టుకోకుండా పందిలా తింటాడు, కుక్కలా వర్క్ అవుట్ చేస్తాడు” అంటూ సల్మాన్ తో తనకి ఉన్న స్నేహంతో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్సే నెట్టింట వైరల్ చేస్తున్నారు.
కాగా సినిమా పరిశ్రమలో బాడీ ఫిట్నెస్, కండలు, సిక్స్ ప్యాక్స్ అంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది సల్మాన్ ఖాన్. తన బాడీ ఫిట్నెస్ తో ఎంతోమంది అబ్బాయిలకు ఐకాన్ అయ్యారు. అమ్మాయిలకు క్రష్ అయ్యారు.