Sharwanand : బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో తండ్రి పాత్రల్లో శర్వానంద్..? శర్వా ప్రయోగాలు చేస్తున్నాడా?
బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో శర్వానంద్ ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నట్టు సమాచారం.
Sharwanand : శర్వానంద్ 2022లో ఒకే ఒక జీవితం సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత ఒక సినిమా ప్రకటించినా మొన్నటిదాకా కూడా ఎలాంటి అప్డేట్స్ లేవు. కానీ ఇటీవల శర్వానంద్ పుట్టిన రోజున ఒకేసారి తన నెక్స్ట్ మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చాడు. శర్వా 35వ సినిమా టైటిల్ ‘మనమే’ అని ప్రకటించారు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లో ఒక బాబు చెయ్యి పట్టుకొని నిల్చున్నాడు శర్వానంద్. ఈ సినిమాలో శర్వానంద్ తండ్రి పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది.
Welcoming you all to the world of #Manamey ❤️
– https://t.co/pzpbbExgNk#MANAMEYFirstLook@IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla #Kritiprasad @HeshamAWMusic @SonyMusicSouth pic.twitter.com/3EzEmKKMWp
— Sharwanand (@ImSharwanand) March 6, 2024
అలాగే శర్వా 36 సినిమా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో మాళవిక నాయర్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా శర్వా తండ్రిగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఓ తండ్రి పాత్ర దానికి గతంలో ఓ బైక్ రేసర్ పాత్రలో శర్వా కనిపిస్తాడని తెలుస్తుంది.
Gear up for adrenaline pumping adventure with #Sharwa36 💥💥@abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj @AforAnilkumar @UV_Creations pic.twitter.com/IEvptCWnNS
— Sharwanand (@ImSharwanand) March 6, 2024
ఇక శర్వా 37వ సినిమా ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఓ మిడిల్ క్లాస్ ఫాదర్ పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో శర్వానంద్ ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల సీనియర్, స్టార్ హీరోలు సైతం హీరోయిన్స్ తో డ్యాన్సులు వేసే పాత్రలు చేస్తుంటే మిడిల్ రేంజ్ యువ హీరోలు ఇలా తండ్రి పాత్రలు వేయడం విశేషమే. అయితే ఇవి అధికారికంగా ప్రకటించకపోయినా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి నిజంగానే శర్వానంద్ ఫాదర్ పాత్రలు వేసి ప్రయోగాలు చేస్తున్నాడా అంటే వేచి చూడాల్సిందే. ఇటీవల హీరో నాని జెర్సీ, హాయ్ నాన్న సినిమాల్లో తండ్రిగా కనిపించి మెప్పించాడు. మారి శర్వానంద్ ఏ మేరకు మెప్పిస్తాడా చూడాలి.
Getting on a hilarious joy ride with @RamAbbaraju and my dear @AnilSunkara1 Garu. A special film!#Sharwa37 – A celebration of love and laughter ❤️ @Composer_Vishal @gnanashekarvs @brahmakadali @aj_sunkara @kishore_Atv @BhanuBogavarapu @NanduSavirigana pic.twitter.com/ZeyGZ7R1dc
— Sharwanand (@ImSharwanand) March 6, 2024