Rishabh Pant : శుభ‌వార్త‌.. ఐపీఎల్ 2024 ఆడేందుకు రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకట‌న‌

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ రీ ఎంట్రీ ఫిక్సైంది.

Rishabh Pant : శుభ‌వార్త‌.. ఐపీఎల్ 2024 ఆడేందుకు రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకట‌న‌

Rishabh Pant

Rishabh Pant – IPL 2024 : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ రీ ఎంట్రీ ఫిక్సైంది. ఐపీఎల్ 2024 సీజ‌న్‌తోనే అత‌డు పోటీ క్రికెట్‌ ఆడ‌నున్న‌ట్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్ల‌డించింది. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో అత‌డు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌గా బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

‘రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి కోలుకుని, దాదాపు 14 నెల‌ల పాటు ఆట‌కు దూరంగా ఉన్న రిష‌బ్ పంత్ ఇప్పుడు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌గా ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టిస్తున్నాము.’ అని బీసీసీఐ తెలిపింది. ఇది నిజంగా అత‌డి అభిమానుల‌తో పాటు భార‌త అభిమానుల‌కు శుభ‌వార్త అని చెప్ప‌వ‌చ్చు.

డిసెంబ‌ర్ 30, 2022లో రిష‌బ్ పంత్ ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. దీంతో అత‌డు 14 నెల‌లుగా ఆట‌కు దూరంగా ఉంటున్నాడు. గాయాల నుంచి కోలుకున్న త‌రువాత అత‌డు బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు.

Cristiano Ronaldo : క‌న్నీళ్లు పెట్టుకున్న ఫుల్‌బాల్ దిగ్గ‌జం.. ఓట‌మి బాధ ఎవ్వ‌రికైనా ఒక‌టేగా..

ఐపీఎల్ 2023, ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ పైన‌ల్‌తో పాటు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పంత్ లేని లోటు క‌నిపించింది. ఇప్పుడు ఐపీఎల్ 2024 సీజ‌న్ అత‌డు ఆడుతుండ‌డంతో జూన్‌లో వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో బ‌రిలోకి దిగే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, ష‌మీ దూరం..

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), గుజరాత్ టైటాన్స్ (జీటీ)లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ షమీలు 17వ సీజ‌న్‌కు దూరం అయ్యారు.

PSL 2024 : అంపైర్‌తో నీకెందుకు సికింద‌ర్ మామ‌.. మ‌ధ్య‌లో వేలుపెడితివి! ఇప్పుడు చూడు..

‘ప్ర‌సిద్ధ్ కృష్ణ ఫిబ్రవరి 23, 2024న ఎడ‌మ కాలికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్నాడు. అతను ప్రస్తుతం వైద్య బృందం పర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడు. త్వరలో నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసాన్ని తిరిగి ప్రారంభిస్తాడు. దీంతో అత‌డు ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో పాల్గొన‌డం లేదు.’ అని బీసీసీఐ తెలిపింది.

చీల‌మండ‌ల గాయంతో బాధ‌ప‌డుతున్న మ‌హ్మ‌ద్ ష‌మీ ఫిబ్ర‌వ‌రి 26, 2024న శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. అతను ప్రస్తుతం వైద్య బృందం పర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు సైతం ఐపీఎల్ 17వ సీజ‌న్‌కు దూరం అయ్యాడు అని బీసీసీఐ పేర్కొంది.