TSPSC Group-1 Exam : తెలంగాణలో గ్రూపు-1 పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?

TSPSC Group-1 Exam Application Date : గ్రూపు-1 పరీక్ష దరఖాస్తు గడువు తేదీని తెలంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పొడిగించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

TSPSC Group-1 Exam : తెలంగాణలో గ్రూపు-1 పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?

TSPSC Group-1 Exam Application date extended for two days

TSPSC Group-1 Exam Application Date : తెలంగాణలోని గ్రూపు-1 పరీక్ష అభ్యర్థులకు గుడ్ న్యూస్.. గ్రూపు-1 పరీక్ష దరఖాస్తు గడువు తేదీని తెలంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పొడిగించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మరో రెండు రోజుల పాటు గ్రూప్-1 పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు పేర్కొంది.

Read Also : Ram Gopal Varma : పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా.. ఆర్జీవీ సంచలన ట్వీట్..!

షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్‌-1 భర్తీకి అభ్యర్థుల దరఖాస్తు గడువు అధికారికంగా నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే మరో 2 రోజుల వరకు గడువును పొడిగించింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైంది.

ఇప్పటివరకూ 2.7 లక్షల దరఖాస్తులు :
అయితే, మార్చి 13వ తేదీ వరకు ఈ పరీక్ష కోసం 2.7 లక్షలకు పైగా నిరుదోగ్యులు దరఖాస్తు చేసుకున్నారని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. 2 రోజులు గడువు పెంపుతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రక్రియ తర్వాత అప్లికేషన్ల సంఖ్యపై మరింత క్లారిటీ రానుంది.

జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. అక్టోబరు 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షలకు 7 రోజుల ముందుగానే అధికారిక వెబ్‌సైట్‌లో గ్రూపు 1 పరీక్ష హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు మార్చి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో (https://www.tspsc.gov.in/) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also : PPBL Deadline : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మార్చి 15 నుంచి ఏది పనిచేయదు? ఏది చేయొచ్చు? ఫాస్ట్‌ట్యాగ్స్, యూపీఐ, వ్యాలెట్ల పరిస్థితి ఏంటి?