Om Bheem Bush : శ్రీవిష్ణు ప్రత్యేక ఇంటర్వ్యూ.. ‘ఓం భీమ్ బుష్’ సెకండ్ హాఫ్‌లో..

‘ఓం భీమ్ బుష్’ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.

Om Bheem Bush : శ్రీవిష్ణు ప్రత్యేక ఇంటర్వ్యూ.. ‘ఓం భీమ్ బుష్’ సెకండ్ హాఫ్‌లో..

Sree Vishnu special interview in m Bheem Bush movie promotions

Om Bheem Bush : శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి ఆడియన్స్ ని నవ్వించడానికి తీసుకు వస్తున్న సినిమా ‘ఓం భీమ్ బుష్’. ఇప్పటికే రిలీజైన టీజర్ అండ్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ శుక్రవారం మార్చి 22న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ ప్రమోషన్స్ తోనే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నవ్విస్తూ వస్తున్నారు. తాజాగా శ్రీవిష్ణు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.

‘ఓం భీమ్ బుష్’ మూవీ టైటిల్ నుంచి ప్రమోషనల్ కంటెంట్ వరకు ప్రతిదానికి మంచి రెస్పాన్స్ వస్తుండడం ఎలా అనిపిస్తుంది?
ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కి చాలా సంతోషం వేస్తుంది. సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తో కొత్తగా ప్రెజెంట్ చేస్తూ ఈ సినిమాని తీసుకు వస్తున్నాము. సినిమాలో మా పాత్రలు ఆడియన్స్ ని హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తాయి.

ఈ కథ అనుకున్నప్పుడే ‘ఓం భీమ్ బుష్’ టైటిల్ ని ఫిక్స్ చేశారా?
మొత్తం మీద ఒక మూడు టైటిల్స్ ని అనుకున్నాము. వాటిలో ఒకటి ఇంగ్లీష్ టైటిల్. అయితే నాకు మాత్రం ‘ఓం భీమ్ బుష్’ టైటిల్ బాగా నచ్చింది. చిన్నప్పుడు మనం మ్యాజిక్కులు చేయడానికి వాడే మంత్రం అది. ఆ టైటిల్ కూడా ఇప్పుడు మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

ఇలాంటి కాన్సెప్ట్ సినిమాక కథల్లో కొత్త పాయింట్ ఉన్నప్పటికీ.. నటన, డైలాగ్స్ విషయానికి వచ్చేసరికి రెగ్యులర్ సినిమాలా అయిపోయే అవకాశం వుంది. మరి ‘ఓం భీమ్ బుష్’లో ఆ ఒరిజినాలిటీ ఎలా ఉండబోతుంది?
స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే ఇప్పటివరకు ఎవరూ ఈ పాయింట్ తో రాలేదు. అలాగే మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు, మూవీలో ఎంటర్‌టైన్మెంట్ తో పాటు ఇంకొకటి కూడా బావుందని ప్రేక్షకులు అంటారు. అది ఏంటనేది సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుంది.

సామజవరగమన బ్లాక్ బస్టర్ అయ్యింది. మరి ఆ సినిమా తెచ్చిన మార్కెట్ ని కాపాడుకోవాలి, పెంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంటారా?
నేను ఎప్పుడూ అలా ప్లాన్ చేయను. మార్కెట్ పెరగాలనే జోన్ లోకి వెళ్తే.. ఇక మన దృష్టి అంతా అటువైపు వెళ్ళిపోతుంది. నేను దృష్టి పెట్టే విషయం ఒకటే.. నిర్మాత మన మీద పెట్టిన పెట్టుబడి పోకూడదు.

సామజవరగమన సెట్ చేసిన అంచనాలని ‘ఓం భీమ్ బుష్’ అందుకుంటుందా?
ఆల్రెడీ ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడికి మూడు, నాలుగు రెట్ల లాభం వచ్చేసింది. దీనికి సామజవరగమన విజయం, ‘ఓం భీమ్ బుష్’ టీజర్, ట్రైలర్, యూవీ బ్యానర్ హెల్ప్ అయ్యింది.

‘బ్రోచేవారెవరురా’ తర్వాత మీరు, దర్శి, రాహుల్.. కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది కదా.. కామెడీ విషయంలో ఒక ప్రత్యేకమైన కథని ఎంచుకోవాలనే ఒత్తిడి ఏమైనా పెరిగిందా?
అలాంటి ఒత్తిడి ఏమి తీసుకోలేదు. మేము ముగ్గురం రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాము. దీంతో ముగ్గురు ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుంటూ ఎలా ఉంటుందో అలా సాగిపోయింది షూటింగ్ అంతా. అంతా నేచురల్గా వచ్చింది. సింగిల్ లైనర్స్ హిలేరియస్ గా ఉంటాయి.

సెకండ్ హాఫ్ లో హిలేరియస్ బ్లాక్స్ ఉంటాయని విన్నాం ?
ఫస్ట్ హాఫ్ లో మూడు బ్లాకులు, సెకండ్ హాఫ్ లో రెండు బ్లాకులు ఎంటర్‌టైన్మెంట్ పరంగా హిలేరియస్ గా ఉంటాయి. వాటిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ గ్రూప్ గా చూస్తే ఇంకా అదిరిపోతుంది.

కథలో మీ ముగ్గిరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి ?
మేము సైంటిస్టులు కావాలని పీహెచ్డీ చేస్తాం. మమ్మల్ని ఎలాగైనా కాలేజీ నుంచి పంపించేయాలని స్కెచ్ వేసి పంపించేస్తారు. తర్వాత భైరవపురం అనే ఊరుకి వెళ్తాము. ఆ ఊరిలో ఎదురయ్యే పరిస్థితులు, పాత్రలు హిలేరియస్ గా ఉంటాయి. కాలేజీలో ఉన్నప్పుడు ఎలా అయితే కింగ్స్ లా ఉండేవాళ్ళమో, అక్కడ కూడా అలానే కింగ్స్ లా ఉంటాము. ఎక్కడున్నా కింగ్ లా బ్రతికేసే పాత్రలివి. ఈ క్రమంలో నిధిని పట్టుకునే టాస్క్ వస్తుంది. అసలు నిధి ఉందా లేదా. మా ప్రయత్నాలు ఎలా జరిగాయనేది మిగతా కథ. చాలా సరదాగా హిలేరియస్ గా సాగే సినిమా ఇది.

దర్శకుడు శ్రీహర్ష ఈ కథ ద్వారా ఎలాంటి కొత్తదనం తీసుకొచ్చారు? ఆయన విజన్ ని ఎలా అంచనా వేశారు?
శ్రీహర్ష చెప్పిన కథకు కొంచెం కలర్ ఫుల్ గా వెళ్తే బాగుంటుంది అనిపించింది. డీవోపీ రాజ్ తోటతో ఆరు సినిమాలు చేశాను. సంగీత దర్శకుడు సన్నీ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఒక అద్భుతమైన ప్రొడక్షన్ హౌస్. ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఇంతమంచి టీం రావడంతో దర్శకుడు విజన్ కూడా క్లియర్ గా అర్ధమైయింది.

దర్శకుడు సినిమాలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారని చెప్పారు. ట్రైలర్ లో ఒక్క హీరోయినే కనిపిస్తుంది. మిగతా వారిని దాచారా?
దాయలేదండి. ప్రియా వడ్లమాని ఓ పాటలో కనిపిస్తారు. ట్రైలర్ లో ఆయేషా ఖాన్ కనిపించారు. నిజానికి సినిమాలో ఎటుచూసినా నేను, ప్రియదర్శి, రాహులే కనిపిస్తాం. మిగతా క్యారెక్టర్స్ తమ పాత్రల పరిమితిలో సింపుల్ గానే ఉంటాయి.

దర్శి, రాహుల్ తో మళ్ళీ కలసి వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
మేము మంచి ఫ్రెండ్స్. ఈ సినిమా షూటింగ్ పూణేలో చేశాం. అక్కడ లొకేషన్ కి దగ్గరలోని ఓ పొలంలో వసతి ఏర్పాటు చేసుకొని ముగ్గురం కలిసి ఉన్నాము. దాదాపు పదిహేనురోజులు అక్కడే ఉన్నాము సినిమా షూటింగ్ ని బాగా ఎంజాయ్ చేసాము.

‘సామజవరగమన’ లా ఈ సినిమాకి పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారా ?
సమయం ఉంది కాబట్టి ప్రిమియర్స్ వేయాలనే అయితే ఆలోచన ఉంది.

మీ కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి?
ఆల్రెడీ అనౌన్స్ చేసిన ‘శ్వాగ్’ దాదాపు పూర్తయింది. దీంతో పాటు ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా, కోన గారితో ఒక సినిమా చేస్తున్నాను.