Game Changer : ఆ దేశ రాజధానిని.. ‘జరగండి’ సాంగ్ లొకేషన్‌గా మార్చేసిన శంకర్..

'జరగండి' సాంగ్ కోసం ఆ దేశ రాజధానిని లొకేషన్‌గా మార్చేసిన శంకర్.

Game Changer : ఆ దేశ రాజధానిని.. ‘జరగండి’ సాంగ్ లొకేషన్‌గా మార్చేసిన శంకర్..

Ram Charan Game Changer Jaragandi song real location

Game Changer : తమిళ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్స్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. నేడు చరణ్ బర్త్ డే కావడంతో ఈ మూవీ నుంచి ‘జరగండి’ అనే మాస్ బీట్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది. ముఖ్యంగా సాంగ్ లోని విజువల్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

శంకర్ సినిమాల్లో పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనవసరం లేదు. సినిమాలోని సగం బడ్జెట్ సాంగ్స్ లోనే కనిపిస్తుంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సాంగ్ లో కూడా అదే రేంజ్ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ జరగండి సాంగ్ లో రంగురంగు భవనాలతో కలర్ ఫుల్ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ సాంగ్ లో కనిపించే మొత్తం ఒక సెట్. అయితే ఈ సెట్ ని ఓ దేశ రాజధాని నుంచి రిఫరెన్స్ గా తీసుకోని నిర్మించారు.

Also read : Ram Charan : చరణ్‌కి సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్.. పవన్, ఎన్టీఆర్ ట్వీట్.. బన్నీ క్వశ్చన్ మార్క్..?

కరేబియన్ దేశం ‘హైతీ’ రాజధాని ‘పోర్ట్ ఓ ప్రిన్స్’కి చెందిన లొకేషన్‌ని ‘జరగండి’ సాంగ్ కోసం శంకర్ రీ క్రియేట్ చేసారు. హైదరాబాద్ శంషాబాద్ లో ఈ సెట్ ని భారీ ఖర్చు చేసి నిర్మించారు. కేవలం ఈ పాట కోసం ఏకంగా రూ.16 కోట్లు ఖర్చు చేశారని అప్పటిలో ఫిలిం నగర్ లో కామెంట్స్ వినిపించాయి. ప్రస్తుతం రియల్ లొకేషన్స్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.