ఏఐ గురించి మోదీ, బిల్‌గేట్స్‌ ఏమేం మాట్లాడుకున్నారో తెలుసా?

Narendra Modi: నమో యాప్‌లో ఏఐ వినియోగంపై బిల్‌గేట్స్‌కు చెప్పారు ప్రధాని.

ఏఐ గురించి మోదీ, బిల్‌గేట్స్‌ ఏమేం మాట్లాడుకున్నారో తెలుసా?

Bill Gates, Narendra Modi

అభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీతో ఉపయోగాలతో పాటు.. సవాళ్లు కూడా ఉన్నాయన్నారు ప్రధాని నరేంద్రమోదీ. విద్య, వ్యవసాయం రంగాల్లో టెక్నాలజీ కీరోల్ ప్లే చేస్తోందని చెప్పారు. కృత్రిమ మేధతో కొత్త చిక్కులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ చాయ్‌ పే చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్‌ టెక్నాలజీతో వివిధ రంగాలపై వీరిద్దరూ చర్చించారు.

ఏఐ శక్తిమంతమైనదే కానీ.. దాన్ని మ్యాజిక్‌ టూల్‌గా వాడితే మాత్రం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందన్నారు ప్రధాని. సరైన శిక్షణ లేనివారికి ఏఐని అందిస్తే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఎప్పుడైనా తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే పక్కదారి పడుతుందన్నారు.

డెవలప్ అవుతోన్న టెక్నాలజీని తానెప్పుడూ వెల్ కమ్ చేస్తానన్నారు మోదీ. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానని చెప్పారు. జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వాడుకున్నామన్నారు ప్రధాని. కృత్రిమ మేధతో హిందీలో మాట్లాడిన ప్రసంగాన్ని తమిళంలోకి ట్రాన్స్‌లేట్ చేశామన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ పెద్ద అవకాశమన్నారు బిల్ గేట్స్. అయితే సవాళ్లు కూడా ఉన్నాయన్నారు. ఏఐతో సృష్టించిన డీప్‌ఫేక్‌ కంటెంట్‌ గుర్తించడం చాలా కష్టమని, ఐతే కంటెంట్‌కు వాటర్‌మార్క్‌లు ఉంటే తప్పుదోవ పట్టించలేరని అన్నారు.

నమో యాప్‌లో ఏఐ వినియోగంపై బిల్‌గేట్స్‌కు చెప్పారు ప్రధాని. ఇందులో సెల్ఫీ తీసుకుంటే అందులో ఉన్న ముఖాన్ని గుర్తించి అతడి పాత ఫొటోలను రిట్రీవ్‌ చేస్తుందన్నారు. బిల్ గేట్స్ నమో యాప్‌లో సెల్ఫీ దిగగానే.. మోదీతో దిగిన పాత ఫొటోలు రిట్రీవ్ అయ్యాయి.

 

Also Read: సునీతా కేజ్రీవాల్ మరో రబ్రీదేవి కాబోతున్నారా? పార్టీని, ఢిల్లీ పీఠాన్ని నడిపించే నారీ శక్తి ఆమేనా?