హైదరాబాద్‌లో సీఎస్కే జట్టు.. ధోనీ ధోనీ అంటూ అభిమానుల కేకలు.. ధోనీ మాత్రం సైలెంట్‌గా..

CSK vs SRH: తమ జట్టు హైదరాబాద్ చేరుకుందని తెలుపుతూ సీఎస్కే ఇందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసింది.

హైదరాబాద్‌లో సీఎస్కే జట్టు.. ధోనీ ధోనీ అంటూ అభిమానుల కేకలు.. ధోనీ మాత్రం సైలెంట్‌గా..

@ChennaiIPL

చైన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఆ జట్టు సభ్యులను భారీ భద్రత మధ్య ప్రత్యేక బస్సులో తీసుకెళ్లారు. మహేందర్ సింగ్ ధోనీని చూసిన అభిమానులు ఒక్కసారిగా కేకలు వేశారు.

ధోనీ ధోనీ అంటూ అభిమానులు హోరెత్తించారు. ధోనీ మాత్రం సైలెంట్‌గా వెళ్లిపోయాడు. తమ జట్టు హైదరాబాద్ చేరుకుందని తెలుపుతూ సీఎస్కే ఇందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసింది. పాయింట్ల పట్టికలో సీఎస్కే ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా, హైదరాబాద్ జట్టు ఐదో స్థానంలో ఉంది.

ఏప్రిల్ 5న చెన్నై, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ముంబై, హైదరాబాద్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇదే స్టేడియంలో ఏప్రిల్ 25న బెంగుళూరు vs హైదరాబాద్, మే 2న రాజస్థాన్ vs హైదరాబాద్, మే 8న లక్నో vs హైదరాబాద్, మే 16న గుజరాత్ vs హైదరాబాద్, మే 19న పంజాబ్ vs హైదరాబాద్ మ్యాచులు జరుగుతాయి.