IPL 2024 : ముంబై ఇండియన్స్ ఊపిరిపీల్చుకో..! స్టార్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు

ముంబై జట్టు తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. ఆ తరువాత మ్యాచ్ 11న ఆర్సీబీ జట్టుతో ఆడనుంది.

IPL 2024 : ముంబై ఇండియన్స్ ఊపిరిపీల్చుకో..! స్టార్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు

Mumbai Indians

Suryakumar Yadav : ఐపీఎల్ 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు పేవల ప్రదర్శనతో అభిమానుల విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై జట్టు ఆడుతుంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్ ఆ జట్టు ప్లేయర్లు విఫలమవుతున్నారు. అయితే, హార్దిక్ కెప్టెన్సీ సరిగాలేని కారణంగానే ముంబై జట్టు వరుసగా ఓడిపోతుందని రోహిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. మళ్లీ రోహిత్ కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు.. ముంబై ఇండియన్స్ ఊపిరి పీల్చుకో.. సూర్య వచ్చేస్తున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : IPL 2024 : ఇషాంత్ శర్మ సూపర్ యార్కర్.. ర‌స్సెల్‌కు దిమ్మతిరిగిపోయింది.. ఔటయ్యాక ఏం చేశాడంటే?

సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ నంబర్ వన్ టీ20 ప్లేయర్. అతను ఐపీఎల్ 2024లో ముంబై జట్టులో ఆడుతున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. చివరగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లో ఆడిన సూర్య.. ఆ తరువాత చీలమండలో చీలిక, స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. సూర్య మళ్లీ మైదానంలో అడుగు పెట్టాలంటే ఫిట్ నెస్ పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒక్క పరీక్ష మినహా అన్ని ఫిట్ నెస్ పరీక్షలను సూర్యకుమార్ కుమార్ పూర్తి చేసినట్లు తెలిసింది. గురువారం మిగిలిన ఒక్క ఫిట్ నెస్ పరీక్షనూ సూర్య విజయవంతంగా పూర్తిచేస్తే ముంబై జట్టులో చేరే అవకాశం ఉంది.

Also Read : IPL 2024 : తృటిలో చేజారిన రికార్డు..! ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ జట్టుదే రెండో అత్యధిక స్కోరు

ముంబై జట్టు తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. ఆ తరువాత మ్యాచ్ 11న ఆర్సీబీ జట్టుతో ఆడనుంది. గురువారం జరిగే ఫిట్ నెస్ పరీక్షను సూర్యకుమార్ యాదవ్ విజయవంతం చేస్తే.. 7 లేదా 11వ తేదీల్లో జరిగే మ్యాచ్ నాటికి ముంబై జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. ఐపీఎల్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయిన ముంబై జట్టు.. సూర్యకుమార్ రాకతో మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉంటాయని జట్టు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.