IPL 2024 : విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్.. రెండో ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు

రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శుభమన్ గిల్ 72 పరుగులు చేశాడు. 27పరుగుల వద్ద గిల్ ఐపీఎల్ లో ..

IPL 2024 : విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్.. రెండో ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు

Shubhman Gill

Shubhman Gill : ఐపీఎల్ – 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజేతగా నిలిచింది. తొలుత రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. 197 పరుగుల లక్ష్యంతో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. కెప్టెన్ శుభమన్ గిల్ జట్టును ముందుండి నడిపిస్తే.. ఆఖర్లో రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ గొప్పగా పోరాడి జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్ లో గిల్ 44 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును గిల్ సొంతం చేసుకున్నాడు.

Also Read : RR vs GT : రాజ‌స్థాన్‌కు గుజ‌రాత్ షాక్‌.. సంజూ సేన‌కు తొలి ఓట‌మి

రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శుభమన్ గిల్ 72 పరుగులు చేశాడు. 27పరుగుల వద్ద గిల్ ఐపీఎల్ లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ లీగ్‌లో అత్యంత వేగంగా 3వేల పరుగులు చేసిన రెండో భారతీయ బ్యాటర్ గా గిల్ నిలిచాడు. లీగ్ లో విదేశీ బ్యాటర్లతో కలుపుకొని వేగంగా 3వేల పరుగులు చేసిన నాలుగో బ్యాటర్ గానూ గిల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో 94 ఇన్నింగ్స్ లలో శుభమన్ గిల్ 3వేల పరుగులు చేయగా.. ఇంతకు ముందు కేఎల్ రాహుల్ 80 ఇన్నింగ్స్ లలో ఈ ఘతన సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ 75 ఇన్నింగ్స్ లలో 3వేల పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు. అతను 85 ఇన్నింగ్స్ లలో 3వేల పరుగులు పూర్తి చేశాడు. నాల్గో స్థానంలో శుభమన్ గిల్ నిలవగా.. గిల్ తో పాటు డేవిడ్ వార్నర్ (94 మ్యాచ్ లు), ఫాఫ్ డు ప్లెసిస్ (94 మ్యాచ్ లు) ఫోర్త్ ప్లేస్ లో నిలిచారు.

Also Read : Prithvi Shaw : ముంబైలో సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చుకున్న పృథ్వీ షా.. ల‌గ్జ‌రీ ఫ్లాట్ కొనుగోలు.. ధ‌ర ఎంతంటే?

మరోవైపు ఐపీఎల్ లో 3వేల పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాటర్ గా శుభమన్ గిల్ నిలిచాడు. 24ఏళ్ల 215 రోజుల వయసులో గిల్ 3వేల పరుగుల ఘనత సాధించాడు. ఆ తరువాతి స్థానంలో విరాట్ కోహ్లీ (26 ఏళ్ల 186 రోజులు), సంజు శాంసన్ (26 ఏళ్ల 320 రోజులు), సురేష్ రైనా (27 ఏళ్ల 161 రోజులు), రోహిత్ శర్మ (27 ఏళ్ల 343 రోజులు) ఈ రికార్డును సాధించారు.