Chiranjeevi – Rajinikanth : రజినీకాంత్ చెప్పాడనే చిరంజీవి వాళ్ళతో సినిమాలు చేస్తున్నాడా?

చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ చెప్పిన మాట పాటిస్తున్నాను అని తెలిపారు.

Chiranjeevi – Rajinikanth : రజినీకాంత్ చెప్పాడనే చిరంజీవి వాళ్ళతో సినిమాలు చేస్తున్నాడా?

Rajinikanth give a Suggestion to Chiranjeevi Regarding Movie and he Follows

Chiranjeevi – Rajinikanth : మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్.. ఇద్దరూ కెరీర్ లో పీక్ స్టేజ్ కి వెళ్లి స్టార్ డమ్, హిట్స్, ఫ్లాప్స్, ఫేమ్, అవార్డులు.. ఎన్నో చూసేసారు. ఇప్పుడు ఏజ్ పెరుగుతున్నా ఇంకా సినిమాలు చేయడానికి కారణం అభిమానుల కోసం, సినిమా మీద ప్యాషన్ తో మాత్రమే. ప్రస్తుతం రజినికాంత్, చిరంజీవి.. ఇద్దరూ కూడా యువ దర్శకులకు అవకాశాలిస్తూ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంచి విజయాలు సాధిస్తున్నారు.

ఇటీవల చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ చెప్పిన మాట పాటిస్తున్నాను అని తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ.. కొన్నాళ్ల క్రితం రజినీకాంత్, నేను కలిసినప్పుడు సినిమాల గురించి, దర్శకుల గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు రజినీకాంత్ నాకు ఓ మాట చెప్పారు. ఒకప్పుడు మనం పనిచేసిన లెజెండరీ దర్శకులు ఇప్పుడు లేరు, కొంతమంది సినిమాలు తీయట్లేదు. మనం కొత్త దర్శకులకు, యువ దర్శకులకు ఛాన్సులు ఇవ్వాలి. ఇప్పుడున్న దర్శకుల్లో మన ఫ్యాన్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మనల్ని ఎలా చూపించాలో, ఎలా చూడాలనుకున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి మనకు మంచి సినిమాలు ఇస్తారు అని తెలిపారు. రజినీకాంత్ మాటలు నేను పాటిస్తున్నాను. అలా బాబీకి ఛాన్స్ ఇచ్చాను, వాల్తేరు వీరయ్య లాంటి హిట్ సినిమా ఇచ్చాడు. ఇప్పుడు వశిష్టతో విశ్వంభర చేస్తున్నాను అని తెలిపాడు.

Also Read : Pooja Hegde : పూజాహెగ్డే అన్ని కోట్లు పెట్టి ముంబైలో ఇల్లు కొందా? స్టార్ హీరోలు కూడా అంత ఖర్చుపెట్టరేమో..

దీంతో ఇకపై చిరంజీవి యువ దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేస్తాడని తెలుస్తుంది. మరోవైపు రజినీకాంత్ కూడా లోకేష్, నెల్సన్ లాంటి యువ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు. రజినీకాంత్ చెప్పింది కూడా నిజమే. ఇప్పుడున్న యువ దర్శకుల్లో హీరోల అభిమానులు ఉంటే తమ హీరోని ఎలా చూడాలనుకున్నారో అలా చూపిస్తారు. రజిని చెప్పిన మాటని చిరంజీవి పాటించండం గమనార్హం.