NIA Raids : ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఎందుకంటే?

మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలకు సంబంధించి మే13న ముంబై పోలీసుల నుండి కేసును ఎన్ఐఏ స్వీకరించింది.

NIA Raids : ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఎందుకంటే?

NIA Raids, (Image Credit _ Google)

NIA conducted raids in Multi states : మానవ అక్రమ రవాణా, సైబర్ మోసాల కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 15చోట్ల సోదారులు జరుగుతున్నాయి. ఢిల్లీ, యూపీ, హర్యానా, బీహార్, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, ఛండీఘడ్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ బృందాలు దాడులు చేపట్టాయి. రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర నిఘా సంస్థల సమన్వయంతో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. సోదాల్లో పలు డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు, రిజిస్టర్లు, బహుళ పాస్‌పోర్ట్‌లు, నకిలీ విదేశీ కంపెనీల అపాయింట్మెంట్ లెటర్స్ ను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.

Also Read : IndiGo Flight : టెన్షన్ పెట్టిన టిష్యూ..! ఇండిగో విమానంకు బాంబు బెదిరింపు.. అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణికులను దింపిన సిబ్బంది

మానవ అక్రమ రవాణా, సైబర్ మోసాల కేసులో వడోదరకు చెందిన మనీష్ హింగు, గోపాల్‌గంజ్‌కు చెందిన పహ్లాద్ సింగ్, నైరుతి ఢిల్లీకి చెందిన నబియాలం రే, గురుగ్రామ్‌కు చెందిన బల్వంత్ కటారియా, చండీగఢ్‌కు చెందిన సర్తాజ్ సింగ్‌లను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని యువకులను ప్రలోభపెట్టి విదేశాలకు తరలించే వ్యవస్థీకృత ట్రాఫికింగ్ సిండికేట్‌లో నిందితులు ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఉద్యోగాల పేరుతో లావోస్, గోల్డెన్ ట్రయాంగిల్ SEZ , కంబోడియాలోని నకిలీ కాల్ సెంటర్‌లలో పని చేసేందుకు పంపుతున్న నిందితులు.

Also Read : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కలకలం.. భయపెడుతున్న కొత్త వేరియంట్..!

క్రెడిట్ కార్డ్ మోసాలు, నకిలీ అప్లికేషన్లు ఉపయోగించి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు, హనీ ట్రాపింగ్ సహా చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఆన్‌లైన్‌ ద్వారా చేయడానికి యువతను బలవంతం చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అరెస్టయిన నిందితులు థాయిలాండ్, కంబోడియా వియత్నాం నుండి లావోస్ సెజ్‌కు భారతీయ యువకులను అక్రమంగా సరిహద్దులు దాటించేలా అంతర్జాతీయ సరిహద్దు మీదుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రాఫికర్లతో సమన్వయం చేసుకుంటున్నారని దర్యాప్తులో వెల్లడైంది. మహారాష్ట్ర, యూపీ, బీహార్, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, హర్యానాలోని అనేక జిల్లాల్లో క్రియాశీలంగా ఉన్న వ్యవస్థీకృత సిండికేట్‌లకు చెందిన UAE, కంబోడియా, వియత్నాం, లావోస్ SEZ విదేశీ-ఆధారిత ఏజెంట్ల ఆదేశానుసారం పని చేస్తున్నారని గుర్తించారు.

మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలకు సంబంధించి మే13న ముంబై పోలీసుల నుండి కేసును ఎన్ఐఏ స్వీకరించింది. మానవ అక్రమ రవాణా సిండికేట్ కేవలం ముంబైలో పనిచేయడం లేదని, దేశంలోని వివిధ ప్రాంతాలు, సరిహద్దుల వెంబడి ఇతర సిలిటేటర్‌లు ట్రాఫికర్‌లతో సంబంధాలు కలిగి ఉందని ఎన్ఐఏ గుర్తించింది. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు ఎన్ఐఏ ప్రకటన పేర్కొంది.