చంద్రబాబు చేతిలో చెయ్యేసి పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం ..

చంద్రబాబును పక్కన నెలబెట్టుకొని ఆయన చేతిలో చేయ్యేసి పవన్ భావోద్వేగ పూరితమైన ప్రసంగం చేశారు. చంద్రబాబు నలిగిపోయారు..

చంద్రబాబు చేతిలో చెయ్యేసి పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం ..

Pawan Kalyan

Pawan Kalyan : ఎన్టీయే కూటమి శాసనసభా పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు.

Also Read : పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్: చంద్రబాబు

గత దశాబ్ధకాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు.. నలిగిపోతున్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం కలిసికట్టుగా పోరాటం చేసి అద్భుతమైన మెజార్టీతో 164 ఎమ్మెల్యే స్థానాలను, 21 పార్లమెంట్ స్థానాలను ఎన్డీయే కూటమి దక్కించుకుంది. ఏపీలో ఎన్టీయే కూటమి విజయం దేశం మొత్తం స్ఫూర్తిని ఇచ్చిందని పవన్ అన్నారు. ఒక్క ఓటు చీలకుండా కూటమి అంటే ఇలా ఉండాలి అని మనం చూపించామని పవన్ అన్నారు. ప్రభుత్వ ఓటును చీలనివ్వను అని చెప్పినట్లుగా ఆ మాటమీద నిలబడి, కొన్ని విషయాల్లోతగ్గాం. చివరికి అనుకున్నది సాధించామని పవన్ పేర్కొన్నారు.

కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. ఏపీ ప్రజలు ఏ అభివృద్ధిని కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా మనందరం సమిష్టిగా పనిచేయాలని పవన్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘమైన పాలనా అనుభవం కలిగిన నేత కావాలి. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, పెట్టుబడులు తెచ్చే సమర్ధత, విదేశాల్లో వ్యాపార ప్రముఖులు, ఆయా దేశాల నేతలను ఏపీవైపు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించగలిగే సత్తా ఉన్ననేత చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు పేరును ఎన్డీయే కూటమి పక్షాన ఏపీ సీఎంగా జనసేన తరపున బలపరుస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.

Also Read : జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక

అనంతరం చంద్రబాబును పక్కన నెలబెట్టుకొని ఆయన చేతిలో చేయ్యేసి పవన్ భావోద్వేగ పూరితమైన ప్రసంగం చేశారు. చంద్రబాబు నలిగిపోయారు.. జైల్లో బాబును చూశాను.. భువనేశ్వరిగారి బాధను చూశాను. ఆరోజే చెప్పాను అమ్మా.. మీరు కన్నీరు పెట్టకండి మంచి రోజులు వస్తాయని చెప్పాను. మంచిరోజులు వచ్చాయని పవన్ అన్నారు. మీ అద్భుతమైన పాలన ఏపీకి మరోసారి అందివ్వాలని చంద్రబాబును పవన్ కల్యాణ్ కోరారు.

అనంతరం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడారు.. ప్రజా వ్యతిరేక పాలన అంతమొందించేందుకు ప్రజలు కసిగా ఓట్లు వేశారు. విజయం నుంచీ పాఠాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మూడు పార్టీల లక్ష్యం ప్రజా సంక్షేమమే. మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమం లాంటిదని పురందేశ్వరి అన్నారు. సభానాయకుడిగా పవన్ కల్యాణ్ చేసిన ప్రతిపాదనను బీజేపీ తరపున సమర్ధిస్తున్నామని పురంధేశ్వరి అన్నారు.