Kalki Collections : ‘కల్కి’ వీకెండ్ కలెక్షన్స్ అదిరిపోయాయి.. మొత్తం నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు..?
కల్కి సినిమా కలెక్షన్స్ భారీగా రాబడుతుంది.
![Kalki Collections : ‘కల్కి’ వీకెండ్ కలెక్షన్స్ అదిరిపోయాయి.. మొత్తం నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు..? Kalki Collections : ‘కల్కి’ వీకెండ్ కలెక్షన్స్ అదిరిపోయాయి.. మొత్తం నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు..?](https://10tv.in/wp-content/uploads/2024/07/kalki-collections.jpg)
Prabhas Kalki 2898AD Movie Four Days Collections Full Details
Kalki Collections : ప్రభాస్ కల్కి 2898AD సినిమా డూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి దర్శకుడిని అందరూ అభినందిస్తున్నారు. అన్ని పరిశ్రమల సెలబ్రిటీలు కూడా కల్కి సినిమా చూసి అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అన్ని చోట్ల కల్కి సినిమా కలెక్షన్స్ కూడా భారీగా రాబడుతుంది.
Also Read : Pawan Kalyan : జీతం తీసుకొని పనిచేద్దాం అనుకున్నాను.. కానీ ఇప్పుడు తీసుకోకూడదు అనుకుంటున్నాను..
కల్కి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. రెండు రోజుల్లో 298 కోట్లు వసూలు చేయగా మూడు రోజుల్లో 415 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక నిన్నటి వరకు నాలుగు రోజుల్లో కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 555 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని బరిలో దిగిన కల్కి సినిమా నాలుగు రోజుల్లోనే సగం కలెక్షన్స్ సాధించింది. మరో వారం రోజుల పాటు తెలుగులో ఏ సినిమా లేకపోవడం, బాలీవుడ్ లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో కల్కికి ఈ వారం కూడా కలిసొస్తుంది. వారం రోజుల్లో ఈజీగా 1000 కోట్లు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. అటు అమెరికాలో అయితే అన్ని రికార్దులని బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ రాబడుతుంది కల్కి. ఇప్పటికే కల్కి సినిమా అక్కడ 10 మిలియన్ డాలర్స్ రాబట్టింది. అంటే మన లెక్కల్లో దాదాపు 83 కోట్లు. పలుచోట్ల కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది కల్కి 2898AD సినిమా.
555 CRORES & counting…💥
The BIGGEST FORCES are dominating the GLOBAL BOX OFFICE, show no signs of slowing down ⚡️#Kalki2898AD #EpicBlockbusterKalki@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD… pic.twitter.com/FyYPQkAz7U
— Kalki 2898 AD (@Kalki2898AD) July 1, 2024