మాజీ ఎమ్మెల్యేని మోసం చేసిన కేటుగాళ్లు, అలా నమ్మించి 48లక్షలు కొట్టేశారు..

డబ్బు మొత్తం ఆన్ లైన్ లోనే ట్రాన్సఫర్ చేశారాయన. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మాజీ ఎమ్మెల్యేని మోసం చేసిన కేటుగాళ్లు, అలా నమ్మించి 48లక్షలు కొట్టేశారు..

Ex Mla Jayadev Naidu Case : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే కాదు ప్రముఖులను కూడా మోసం చేస్తున్నారు. దర్యాఫ్తు సంస్థల పేరును అడ్డం పెట్టుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఏపీలో కేటుగాళ్లు ఓ మాజీ ఎమ్మెల్యేని బురిడీ కొట్టించారు. సీబీఐ పేరుతో ఆయన నుంచి ఏకంగా 50లక్షలు కొట్టేశారు.

సీబీఐ పేరుతో మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడుకు ఫోన్ చేశారు కేటుగాళ్లు. మనీ లాండరింగ్ కేసు నమోదైనట్లు బెదిరించారు. కేటుగాళ్ల బెదిరింపులకు భయపడిపోయిన మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు వారు అడిగినట్లు 48లక్షల 49వేల రూపాయలు సమర్పించుకున్నారు. డబ్బు మొత్తం ఆన్ లైన్ లోనే ట్రాన్సఫర్ చేశారాయన. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు పాకాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడికి ఢిల్లీ నుంచి కాల్స్ వచ్చాయి. మేము సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం అని కేటుగాళ్లు ఆయనతో చెప్పారు. మీరు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్లుగా మాకు ఫిర్యాదు అందింది అంటూ ఆయనను విపరీతంగా బెదిరింపులకు గురి చేశారు. ఇది నిజమేనేమో అని ఆయన బాగా భయపడిపోయారు. దీనికి పరిష్కారం ఏం చేయాలో చెప్పండి అని వారినే అడిగారు జయదేవ నాయుడు. సీబీఐ కేసు నుంచి మిమ్మల్ని తప్పించాలంటే అడిగినంత డబ్బు మా అకౌంట్ లోకి పంపితే.. ఆ డబ్బుతో కేసు నుంచి మీ పేరుని తొలగించి మళ్లీ మీ డబ్బుని యధావిధిగా మీ అకౌంట్ కు పంపిస్తామని ఆయన మాటలతో బురిడీ కొట్టించారు కేటుగాళ్లు.

87ఏళ్ల జయదేవ నాయుడు వారి మాటలను పూర్తిగా నమ్మేశారు. తనకు, తన భార్యకు సంబంధించిన 6 బ్యాంకు అకౌంట్ల నుంచి సుమారుగా 50 లక్షల రూపాయలను గడిచిన 3, 4 నెలలుగా పంపుతూ వచ్చారు. ఒకసారి 10 లక్షలు, 15 లక్షలు, 17 లక్షలు, 8 లక్షలు ఇలా సుమారుగా 50లక్షల వరకు డబ్బులు కేటుగాళ్ల అకౌంట్ కు ట్రాన్సఫర్ చేశారు. డబ్బు అంతా పంపాక.. చివరికి ఆయనకు నెమ్మదిగా విషయం అర్థమైంది. తాము మోసపోయానని గ్రహించారు. వెంటనే పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read : అస్సాంలో విద్యార్థి ఘాతుకం.. ఒంగోలు అధ్యాపకుడ్ని కత్తితో పొడిచి హత్య