అస్సాంలో విద్యార్థి ఘాతుకం.. ఒంగోలు అధ్యాపకుడ్ని కత్తితో పొడిచి హత్య

అస్సాంలో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. ఒంగోలు అన్నవరపాడుకు చెందిన అధ్యాపకుడిపై కత్తితో దాడిచేసి హత్య చేశాడు. తరగతి గదిలో బోధన చేస్తున్న ..

అస్సాంలో విద్యార్థి ఘాతుకం.. ఒంగోలు అధ్యాపకుడ్ని కత్తితో పొడిచి హత్య

student stabs teacher to death

Student Stabs Teacher : అస్సాంలో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. ఒంగోలు అన్నవరపాడుకు చెందిన అధ్యాపకుడిపై కత్తితో దాడిచేసి హత్య చేశాడు. ఈ ఘటన శివసాగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. తరగతి గదిలో బోధన చేస్తున్న అధ్యాపకుడు రాజేశ్ బాబు వద్దకు వెళ్లిన విద్యార్థి.. కత్తితో పొడిచి హత్య చేశాడు. గణితంలో మార్కులు తక్కువ రావడంతోపాటు సదరు విద్యార్థి ప్రవర్తన సరిగ్గాలేక పోవడంతో అధ్యాపకుడు మందలించాడు. దీనికితోడు తన తల్లి దండ్రులను కళాశాలకు తీసుకరావాలని విద్యార్థిని ఆదేశించాడు. దీంతో అవమానకరంగా భావించిన విద్యార్థి అధ్యాపకుడు రాజేష్ బాబుపై కక్ష పెంచుకున్నాడు.

Also Read : రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా ఏమన్నదంటే?

సాయంత్రం తన వెంట తెచ్చుకున్న కత్తితో తరగతి గదిలో కెమిస్ట్రీ క్లాస్ చెబుతున్న రాజేశ్ బాబుపై విద్యార్థి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. తల, ఛాతీపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో రాజేశ్ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనే రాజేశ్ బాబు ప్రాణాలు విడిచాడు. రాజేశ్ బాబుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని ఒంగోలుకు తరలించి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read : Mumbai rain : ముంబైలో భారీ వర్షాలు.. 24గంటల పాటు రెడ్ అలర్ట్.. 50కిపైగా విమానాలు రద్దు

రాజేశ్ బాబు కెమిస్ట్రీ అధ్యాపకుడిగా విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పది సంవత్సరాలపాటు పనిచేశాడు. అనంతరం తన మిత్రులతో కలిసి అస్సాంలోని శివసాగర్ ప్రాంతంలో సొంతగా కళాశాల నెలకొల్పాడు. 13సంవత్సరాలుగా కళాశాల ప్రిన్సిపల్ గా రాజేశ్ బాబు కొనసాగుతుండగా డైరెక్టర్ గా రాజేశ్ బాబు సతీమణి వ్యవహరిస్తుంది. తాజా ఘటనతో రాజేశ్ బాబు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. హత్యకు కారణమైన విద్యార్థి వయస్సు 16ఏళ్లు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని శివసాగర్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.