ఆరోగ్యశ్రీపై అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలను తొలగించేలా చూడాలని తెలిపారు.

ఆరోగ్యశ్రీపై అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy Aarogyasri: ఆరోగ్యశ్రీపై అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పథక లబ్ధిదారుల ఆరోగ్య శ్రీ కార్డును రేషన్ కార్డుతో అనుసంధానం చేసే అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందేలా చూడాలని చెప్పారు.

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని తెలిపారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇవ్వాలని, అనంతరం సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని చెప్పారు. ఇందుకోసం అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.

ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలను తొలగించేలా చూడాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సర్కారు దవాఖానాల్లో ప్రతి బెడ్‌కు ఓ సీరియల్ నెంబర్ ఉండేలా చూడాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా చూడాలన్నారు. ఆసుపత్రుల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని తెలిపారు.

ఆదేశాలను స్వాగతిస్తున్నాం: హరీశ్ రావు
రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ లింకు పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఇదే సూత్రాన్ని రైతు రుణమాఫీకి వర్తింపజేయాలని, రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పాస్ బుక్ నే రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

Also Read: ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని ఉద్బోధ