Acer Aspire 3D 15 Spatiallabs : ఏసర్ అస్పైర్ 3డీ 15 స్పాటియాల్యాబ్స్ ల్యాప్‌టాప్ ఇదిగో.. రియల్ టైమ్ 3డీ వ్యూ చూడొచ్చు..!

Acer Aspire 3D 15 Spatiallabs : ఈ ఏసర్ ల్యాప్‌టాప్‌ను నివిడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4050 జీపీయూతో పాటు గరిష్టంగా 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో కాన్ఫిగర్ చేయవచ్చు. 32జీబీ డీడీఆర్5 మెమరీ, 2టీబీ ఎమ్.2 పీసీఐఈ ఎస్ఎస్‌డీ స్టోరేజీ ప్యాక్ చేస్తుంది.

Acer Aspire 3D 15 Spatiallabs : ఏసర్ అస్పైర్ 3డీ 15 స్పాటియాల్యాబ్స్ ల్యాప్‌టాప్ ఇదిగో.. రియల్ టైమ్ 3డీ వ్యూ చూడొచ్చు..!

Acer Aspire 3D 15 Spatiallabs ( Image Source : Google )

Acer Aspire 3D 15 Spatiallabs : కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. భారత మార్కెట్లో ఏసర్ నుంచి అస్పైర్ 3డీ 15 స్పాటియాల్యాబ్స్ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. గ్లాసెస్-ఫ్రీ 3డీ మోడ్‌ను అందిస్తుంది. 2డీ మోడ్‌లో 4కె రిజల్యూషన్‌ను కూడా అందిస్తుంది. ఏసర్ అస్పైర్ 3డీ 15 స్పాటియాల్యాబ్స్ 3డీ టెక్నాలజీతో వస్తుంది.

Read Also : కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్.. దెబ్బకు దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ఏకంగా రూ. 4వేల వరకు తగ్గింపు..!

వినియోగదారులు తమ ప్రాజెక్ట్‌లను గ్లాసులు లేకుండా రియల్ టైమ్ 3డీలో వీక్షించవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, నివిడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4050 జీపీయూ వరకు అమర్చారు. 32జీబీ వరకు ర్యామ్, 2టీబీ వరకు స్టోరేజీని అందిస్తుంది. వై-ఫై6 కనెక్టివిటీని అందిస్తుంది.

భారత్‌లో ఏసర్ అస్పైర్ 3డీ 15 స్పాటియాల్యాబ్స్ ధర :
దేశంలో ఏసర్ అస్పైర్ 3డీ 15 స్పాటియాల్యాబ్స్ ప్రారంభ ధర రూ. 1,49,999కు పొందవచ్చు. ఏసర్ ఆన్‌లైన్ స్టోర్, ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు సింగిల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంటుంది.

ఏసర్ అస్పైర్ 3డీ 15 స్పాటియాల్యాబ్స్ స్పెసిఫికేషన్‌లు :
ఏసర్ అస్పైర్ 3డీ 15 స్పాటియాల్యాబ్స్ ల్యాప్‌టాప్ స్పాటియాల్యాబ్స్ టెక్నాలజీని అందిస్తుంది. డిస్‌ప్లేలో 2డీ, స్టీరియోస్కోపిక్ 3డీ మోడ్‌ల మధ్య మారడాన్ని అనుమతిస్తుంది. 2డీ మోడ్‌లో 15.6-అంగుళాల 4కె (1,920 x 2,160 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను 380నిట్స్ వరకు బ్రైట్‌నెస్, 3D మోడ్‌లో అడోబ్ ఆర్‌జీబీ కలర్ గామట్ 100 శాతం కవరేజీని కలిగి ఉంది. యూజర్ తన కంటి కదలికల ఆధారంగా ఫొటోలను ప్రొజెక్ట్ చేసేందుకు ఆప్టికల్ లెన్స్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఏసర్ ల్యాప్‌టాప్‌ను నివిడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4050 జీపీయూతో పాటు గరిష్టంగా 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో కాన్ఫిగర్ చేయవచ్చు. 32జీబీ డీడీఆర్5 మెమరీ, 2టీబీ ఎమ్.2 పీసీఐఈ ఎస్ఎస్‌డీ స్టోరేజీ వరకు ప్యాక్ చేస్తుంది.

వీడియో కాల్స్ విషయానికి వస్తే.. ఏసర్ అస్పైర్ 3డీ 15 స్పాటియాల్యాబ్స్ ఎడిషన్ 720పీ రిజల్యూషన్‌తో కూడిన హెచ్‌డీ కెమెరాను కలిగి ఉంటుంది. ఏసర్ టెంపోరల్ నాయిస్ రిడక్షన్ (TNR) టెక్నాలజీతో 30ఎఫ్‌పీఎస్ (సెకనుకు ఫ్రేమ్‌లు) వద్ద వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. తక్కువ-కాంతిలోనూ ఇమేజ్ అప్‌గ్రేడ్ ఏసర్ ప్యూరిఫైడ్ వ్యూ, ఫ్యూరిఫైడ్ వాయిస్, ఏసర్ టీఎన్ఆర్ వంటి ఏఐ టెక్నాలజీని కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌లో డీటీఎస్ అల్ట్రాసౌండ్ పర్సనలైజడ్ ఏసర్ సెన్స్ యాప్ ఉన్నాయి.

ఏసర్ అస్పైర్ 3డీ 15 స్పాటియాల్యాబ్స్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై6, యూఎస్‌బీ టైప్-సి (థండర్‌బోల్ట్ 4), హెచ్ఎండీఐ 2.1 పోర్ట్ ఉన్నాయి. స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. థర్మల్ మేనేజ్‌మెంట్ విషయానికి వస్తే.. ల్యాప్‌టాప్‌లో ట్విన్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇందులో డ్యూయల్ ఫ్యాన్‌లు, మూడు కాపర్ హీట్ పైపులు ఉన్నాయి.

Read Also : UPI One World Wallet : ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్.. కొత్త యూపీఐ వన్ వరల్డ్ వ్యాలెట్ సర్వీసు.. ఈజీ పేమెంట్స్!