YS Viveka Case : వివేకా హత్యకేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరు తొలగింపు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల జాబితా నుంచి సీబీఐ కోర్టు ..

YS Viveka Case : వివేకా హత్యకేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరు తొలగింపు

YS Viveka Case

YS Viveka Case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల జాబితా నుంచి సీబీఐ కోర్టు దస్తగిరి పేరును తొలగించింది. అప్రూవర్ గా మారడంతో నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించి, సాక్షిగా పరిగణించాలని దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రంలోనూ తనను సాక్షిగా చేర్చిన విషయాన్ని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దస్తగిరి వాదనలను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వివేకా హత్యకేసులో దస్తగిరిని సాక్షిగా పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.

Also Read : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. మూత్ర విసర్జన చేస్తుండగా కారు టైర్ ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి

2019 మార్చి 14న అర్ధరాత్రి పులివెందులలోని సొంత గృహంలో వైఎస్ వివేకా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐతో విచారణజరిపించాలని కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో దస్తగిరి నాలుగో నిందితుడు. ఐదేళ్లపాటు అతను జైల్లో ఉన్నాడు. పలుసార్లు సీబీఐ విచారణల అనంతరం దస్తగిరి అప్రూవర్ గా మారాడు. ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్ అయ్యారనే విషయాలను దస్తగిరి సీబీఐ అధికారులకు వెల్లడించారు. ఆ తరువాత బెయిల్ పై దస్తగిరి బయటకు వచ్చాడు. అప్రూవర్ గా మారడంతో నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించి, సాక్షిగా పరిగణించాలని దస్తగిరి పిటిషన్ దాఖలు చేయగా.. సీబీఐ కోర్టు వివేకా హత్యకేసులో అతన్ని సాక్షిగా మాత్రమే పరిగణిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Also Read : మనిషిని మింగేసేందుకు ప్రయత్నించిన కొండచిలువ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వెన్నులో వణుకుపుట్టించే వీడియో