Mohammed Shami : మటన్‌కి షమీ బౌలింగ్‌కు సంబంధం ఏంటో తెలుసా..!
షమీ డైట్ గురించి అతడి స్నేహితుడు ఉమేశ్ కుమార్ వెల్లడించాడు.
Shami Eat 1kg Mutton Daily : టీమ్ఇండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ 2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే.. గాయం కారణంగా ఆ తరువాత ఆటకు దూరం అయ్యాడు. శస్త్రచికిత్స అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందున్నాడు. ప్రస్తుతం అతడు ఫిట్నెస్ సాధించి, రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో అతడు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఇటీవల బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే.. షమీ డైట్ గురించి అతడి స్నేహితుడు ఉమేశ్ కుమార్ వెల్లడించాడు. శుభాంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో ఉమేశ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు. షమీ మాంసాహారం అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. మటన్ లేనిదే ముద్ద దిగదన్నాడు. రోజూ కేజీ మటన్ ఉండాల్సిందేనని, ఒకవేళ వరుసగా రెండు మూడు రోజులు మటన్ తినకపోతే షమి బౌలింగ్ వేగం గంటలకు 15 కి.మీలకు కూడా పడిపోవచ్చునని చెప్పాడు.
‘షమీకి మటన్ అంటే చాలా ఇష్టం. తన డైట్లో ఏమైనా తేడాలు వచ్చినా సహిస్తాడు ఏమో గానీ, మటన్ లేకుంటే మాత్రం కష్టమే. మటన్ తినకుండా ఒక్క రోజు ఉండగలడు ఏమోగానీ, రెండో రోజు మాత్రం అతడిలో ఆందోళన కనిపిస్తుంది. ఇక మూడో రోజు కూడా తినకుంటే మాత్రం నియంత్రణ కోల్పోతాడు. అతడి బౌలింగ్ స్పీడ్ గంటకు పదిహేను కిలోమీటర్ల మేర తగ్గిపోవచ్చు.’ అని ఉమేశ్ అన్నాడు.
ఇక షమీకి షాపింగ్ చేయడం అంటే సరదా అని తెలిపాడు. మ్యాచ్‌లు లేనపుడు తనను ఢిల్లీలో షాపింగ్‌కు తీసుకువెళ్తాడని ఉమేశ్ కుమార్ చెప్పాడు.
IND vs SL : శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్..