ENG vs WI : ఏంటి అన్న‌యా ఇదీ.. టెస్టు మ్యాచ్ అనుకున్నావా..? టీ20 అనుకున్న‌వా..? అంత తొంద‌రేంది..?

స్వ‌దేశంలో వెస్టిండీస్ జ‌ట్టుతో జ‌రిగిన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్‌ చేసింది.

ENG vs WI : ఏంటి అన్న‌యా ఇదీ.. టెస్టు మ్యాచ్ అనుకున్నావా..? టీ20 అనుకున్న‌వా..? అంత తొంద‌రేంది..?

Skipper Stokes Achieves Another Record

England Whitewash West Indies : స్వ‌దేశంలో వెస్టిండీస్ జ‌ట్టుతో జ‌రిగిన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్‌ చేసింది. ఆదివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. విండీస్ నిర్దేశించిన 82 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 7.2 ఓవ‌ర్ల‌లోనే వికెట్ న‌ష్ట‌పోకుండా ఇంగ్లాండ్ ఛేదించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెన‌ర్‌గా వచ్చిన బెన్‌స్టోక్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 57 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. టీ20 త‌ర‌హాలో బెన్‌స్టోక్స్ ఇన్నింగ్స్ సాగింది. అత‌డితో పాటు మ‌రో ఓపెన‌ర్ బెన్ డకెట్ (25 నాటౌట్; 16 బంతుల్లో 4 ఫోర్లు) వేగంగానే ఆడాడు.

అంత‌క‌ముందు ఓవ‌ర్ నైట్ స్కోరు రెండు వికెట్ల న‌ష్టానికి 33 ప‌రుగుల‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆట‌ను కొన‌సాగించిన వెస్టిండీస్ మ‌రో 142 ప‌రుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో మార్క్‌వుడ్ 5 వికెట్ల‌తో విండీస్‌ ప‌త‌నాన్ని శాసించాడు. అట్కిన్సన్ రెండు వికెట్లు తీశాడు. క్రిస్ వోక్స్‌, షోయ‌బ్ బ‌షీర్‌, బెన్ స్టోక్స్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. విండీస్‌ బ్యాటర్లలో మికైల్‌ లూయిస్‌ (57), కవెమ్‌ హాడ్జ్‌ (55) లు అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు.

Harmanpreet Kaur : ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో ఓట‌మి.. భార‌త్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొద‌ట‌ బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ‌75.1వ ఓవ‌ర్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (61), జేసన్‌ హోల్డర్‌ (59) లు హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో అట్కిన్సన్ నాలుగు వికెట్లు తీశాడు. క్రిస్‌ వోక్స్ మూడు, మార్క్‌ వుడ్ రెండు, షోయబ్‌ బషీర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 376 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్‌ జేమీ స్మిత్‌ (95) తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకోగా.. జో రూట్‌ (87) కెరీర్‌లో 63వ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. దీంతో ఇంగ్లాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 94 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఈ మ్యాచ్‌ రెండున్న‌ర రోజుల్లోనే ముగియ‌డం గ‌మ‌నార్హం.

Dinesh Karthik : దినేశ్ కార్తీక్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. టెస్టుల్లో స‌చిన్ రికార్డును బ్రేక్ చేసే స‌త్తా భార‌త ఆట‌గాళ్ల‌కు లేద‌ట‌..!

పలు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన స్టోక్స్‌..

రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ 24 బంతుల్లోనే అర్థ‌శ‌త‌కం బాదాడు. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ త‌రుపున టెస్టుల్లో అత్యంత వేగ‌వంత‌మైన హాఫ్ సెంచరీ చేసిన ఆట‌గాడిగా స్టోక్స్ చ‌రిత్ర‌ సృష్టించాడు. గ‌తంలో ఈ రికార్డు ఇయాన్ బోథ‌మ్ పేరిట ఉండేది. 1981లో ఢిల్లీలో భార‌త్ పై 28 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేశాడు.

147 ఏళ్ల చ‌రిత్ర గ‌ల‌ టెస్టు క్రికెట్‌లో వేగవంత‌మైన అర్ధ‌శ‌త‌కం బాదిన మూడో ఆట‌గాడిగా స్టోక్స్ నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ ఆట‌గాడు మిస్బా ఉల్ హక్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా పై అత‌డు 21 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ బాదాడు. ఇక రెండో స్థానంలో డేవిడ్ వార్న‌ర్ ఉన్నాడు. వార్న‌ర్ 23 బంతుల్లో పాకిస్తాన్‌పై అర్ధ‌శ‌త‌కం బాదాడు. మూడో స్థానంలో స్టోక్స్‌, జాక్వెస్ క‌లిస్ లు ఉన్నారు.

Mohammed Shami : మ‌ట‌న్‌కి ష‌మీ బౌలింగ్‌కు సంబంధం ఏంటో తెలుసా..!

టెస్టుల్లో వేగ‌వంత‌మైన అర్ధ‌శ‌త‌కాలు చేసిన ఆట‌గాళ్లు..

* మిస్బా ఉల్ హక్ (పాకిస్తాన్) – ఆస్ట్రేలియా పై 21 బంతుల్లో
* డేవిడ్ వార్న‌ర్ (ఆస్ట్రేలియా) – పాకిస్తాన్ పై 23 బంతుల్లో
* జాక్వెస్ క‌లిస్ (ద‌క్షిణాఫ్రికా) – జింబాబ్వే పై 24 బంతుల్లో
* బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్‌) – వెస్టిండీస్ పై 21 బంతుల్లో
* షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ (వెస్టిండీస్‌) – న్యూజిలాండ్ పై 25 బంతుల్లో