Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌నత‌.. ఈ ఏడాది ఇత‌నొక్క‌డే..

టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఈ ఏడాది భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు.

Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌నత‌.. ఈ ఏడాది ఇత‌నొక్క‌డే..

Yashasvi Jaiswal 1000 runs this year

Yashasvi Jaiswal : టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఈ ఏడాది భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 1000 ప‌రుగులు పూర్తి చేసుకున్న తొలి ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పార్మాట్ల (టెస్టులు, టీ20లు)ల‌లో 13 మ్యాచులు ఆడిన య‌శ‌స్వి ఈ మైలురాయిని చేరుకున్నాడు. శ్రీలంక‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అత‌డు దీన్ని అందుకున్నాడు. ప‌ల్లెక‌లె వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో 15 బంతులు ఎదుర్కొన్న య‌శ‌స్వి 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాది 30 ప‌రుగులు చేశాడు.

ఏడాది టెస్టుల్లో య‌శ‌స్వి జైస్వాల్ 740 ప‌రుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో స్వ‌దేశంలో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ సిరీస్‌లో 79.91 స‌గ‌టుతో 712 ప‌రుగులు చేశాడు. ఇక టీ20ల్లో 175 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేటుతో 283 ప‌రుగులు చేశాడు. మొత్తంగా ఈ ఏడాది 13 మ్యాచుల్లో 64 స‌గ‌టుతో 1023 ప‌రుగులు సాధించాడు. రెండు సెంచ‌రీలు, 5 అర్థ‌శ‌త‌కాలు ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది భార‌త్ ఇంకా చాలా మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ లెక్క‌న అత‌డు 2వేల ప‌రుగులు పూర్తి చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వస‌రం లేదు.

IRE vs ZIM : బాల్ ఆప‌క‌పోయినా బాగుండేది గ‌దా.. ఇప్పుడు చూడు.. కష్ట‌ప‌డి బౌండ‌రీ ఆపిన ఫీల్డ‌ర్‌ పై..

ఇక య‌శ‌స్వి త‌రువాతి స్థానంలో శ్రీలంక ఆట‌గాడు కుశాల్ మెండీస్ ఉన్నాడు. ఈ ఏడాది అత‌డు మూడు ఫార్మాట్ల‌లో 26 మ్యాచులు ఆడి 888 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రి త‌రువాత వ‌రుస‌గా ఇబ్రహం జద్రాన్‌ (844), రోహిత​ శర్మ (833) లు ఉన్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు..
* య‌శ‌స్వి జైస్వాల్ (భార‌త్‌) – 13 మ్యాచుల్లో 1023 ప‌రుగులు
* కుశాల్ మెండీస్ (శ్రీలంక‌) – 26 మ్యాచుల్లో 888 ప‌రుగులు
* ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (అఫ్గానిస్తాన్‌) – 25 మ్యాచుల్లో 844 ప‌రుగులు
* రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 17 మ్యాచుల్లో 833 ప‌రుగులు
* పాతుమ్ నిస్సాంక (శ్రీలంక‌) – 17 మ్యాచుల్లో 791 ప‌రుగులు

ENG vs WI : ఏంటి అన్న‌యా ఇదీ.. టెస్టు మ్యాచ్ అనుకున్నావా..? టీ20 అనుకున్న‌వా..? అంత తొంద‌రేంది..?

ఇక రెండో టీ20 మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 161 ప‌రుగులు చేసింది. లంక బ్యాట‌ర్ల‌లో కుశాల్ పెరీరా (34 బంతుల్లో 53) హాఫ్ సెంచ‌రీ చేశాడు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో ర‌వి బిష్ణోయ్ మూడు, అర్ష్‌దీప్ సింగ్, అక్ష‌ర్ ప‌టేల్‌, హార్దిక్ పాండ్యాలు త‌లా రెండు వికెట్లు తీశారు. భార‌త ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే వ‌ర్షం కురిసింది. దాదాపు గంట‌కు పైగా స‌మ‌యం వృథా అయింది.

దీంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో భార‌త ల‌క్ష్యాన్ని 8 ఓవ‌ర్ల‌లో 78 ప‌రుగులుగా నిర్దేశించారు. ఈ ల‌క్ష్యాన్ని భార‌త్ 6.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదింది. భార‌త బ్యాట‌ర్ల‌లో యశస్వి జైస్వాల్‌ (15 బంతుల్లో 30), సూర్యకుమార్‌ యాదవ్‌ (12 బంతుల్లో 26), హార్దిక్‌ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్‌) దూకుడుగా ఆడారు.