Bank Holidays August : ఆగస్టులో బ్యాంకులకు సెలవులు.. ఈ నెలలో 13 రోజులు బంద్..!

సెలవు క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఏయే రాష్ట్రాల్లో ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవు పూర్తి జాబితాను ఓసారి చెక్ చేయండి.

Bank Holidays August : ఆగస్టులో బ్యాంకులకు సెలవులు.. ఈ నెలలో 13 రోజులు బంద్..!

Bank Holidays In August 2024_ Banks To Remain Closed For 13 Days ( Image Source : Google )

Bank Holidays August : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. సెలవు క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. సాధారణంగా, బ్యాంకు బ్రాంచ్‌లు ప్రతి ఇతర శనివారం (రెండవ, నాల్గవ) అన్ని ఆదివారాలు పనిచేయవు. ప్రభుత్వ సెలవులతో పాటు రాష్ట్ర-నిర్దిష్ట పండుగల సమయంలో ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు పనిచేయవు. క్రిస్మస్ వంటి జాతీయ పండుగల సమయంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి.

Read Also : RajaSaab Glimpse : ప్రభాస్ ‘రాజాసాబ్’ గ్లింప్స్ వచ్చేసింది..

వచ్చే ఆగస్టు నెలలో సెలవుల దినాలను పరిశీలించి బ్యాంక్ పనులను నిర్ణయించుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవులను మూడు కేటగిరీల కింద విభజిస్తుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులు, రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సెలవులు, బ్యాంకుల అకౌంట్లను క్లోజ్ చేయడం వంటివి అందులో ఉంటాయి. వచ్చే ఆగస్టులో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్టులో జాతీయ, ప్రాంతీయ సెలవుల పూర్తి జాబితా :

  • ఆగస్టు 3 (శనివారం) : కేర్ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు క్లోజ్
  • ఆగస్టు 4 (ఆదివారం) : వారాంతపు సెలవు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్
  • ఆగస్ట్ 8 (సోమవారం) : గ్యాంగ్‌టక్‌లో, టెండాంగ్ లో రమ్ ఫాత్ సందర్భంగా బ్యాంకులు మూసివేత
  • ఆగస్టు 10 (శనివారం) : రెండో శనివారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు
  • ఆగస్టు 11 (ఆదివారం) : వారాంతపు సెలవు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 13 (మంగళవారం) : దేశభక్తుల దినోత్సవం సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకుల మూసివేత
  • ఆగస్టు 15 (గురువారం) : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు పనిచేయవు
  • ఆగస్టు 18 (ఆదివారం) : వారాంతంలో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
  • ఆగస్టు 19 (సోమవారం) : రక్షా బంధన్ సందర్భంగా త్రిపుర, గుజరాత్, ఒడిశా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు.
  • ఆగస్టు 20 (మంగళవారం) : శ్రీనారాయణ గురు జయంతిని పురస్కరించుకుని కొచ్చిలో బ్యాంకులు మూతపడనున్నాయి.
  • ఆగస్టు 24 (శనివారం) : నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్
  • ఆగస్టు 25 (ఆదివారం) : వారాంతంలో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
  • ఆగస్టు 26 (సోమవారం) : జన్మాష్టమి లేదా కృష్ణ జయంతి సందర్భంగా గుజరాత్, ఒడిశా, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవుదినం.

Read Also : Realme 13 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెల 30 నుంచే రియల్‌మి 13ప్రో సేల్.. ధర, స్పెషిఫికేషన్లు..!