అడవిలో ఒంటరి మహిళ.. ఇనుప గొలుసుతో చెట్టుకు బంధించిన దుర్మార్గులు

గొర్రెలను మేపడానికి అడవిలోకి వెళ్లిన కాపరికి మహిళ కేకలు వినిపించాయి. దీంతో అతడు అటువైపు వెళ్లి చూడగా ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేసివున్న మహిళను గుర్తించాడు.

అడవిలో ఒంటరి మహిళ.. ఇనుప గొలుసుతో చెట్టుకు బంధించిన దుర్మార్గులు

మహిళను కాపాడుతున్న మహారాష్ట్ర పోలీసులు

Woman Rescued: అడవిలో ఇనుప గొలుసుతో బంధించిన మహిళకు పోలీసులు విముక్తి కల్పించారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని సోనుర్లి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతం వెలుగు చూసింది. ఆమె దగ్గర అమెరికా పాస్‌పోర్ట్ ఫోటోకాపీ, తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డ్‌, ఇతర పత్రాలను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారం ఆధారంగా బాధితురాలిని పోలీసులు గుర్తించారు. ఆమెను గోవా మెడికల్ కాలేజీకి తరలించారు.

గొర్రెలను మేపడానికి అడవిలోకి వెళ్లిన కాపరికి మహిళ కేకలు వినిపించాయి. దీంతో అతడు అటువైపు వెళ్లి చూడగా ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేసివున్న మహిళను గుర్తించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి ఆమెను కాపాడారు. బాధితురాలి పేరు లలితా కయి అని, వయసు 50 ఏళ్లని పోలీసులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

చిక్కిశల్యమైన బాధితురాలిని ముందుగా కొంకణ్ ప్రాంతంలో ఉన్న సావంత్‌వాడి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఓరోస్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి మానసిక ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఆమెను అధునాతన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. బాధితురాలు ప్రాణాపాయం నుంచి బయటపడిందని, వైద్యులు ఆమెకు చికిత్స కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. బాధితురాలు మానసిక సమస్యలతో బాధపడుతోందని.. ఆమె వద్ద మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లు ఉన్నాయని వెల్లడించారు.

Also Read : రియల్ లైఫ్ ‘గజినీ’? ముంబై హిస్టరీ-షీటర్ దారుణహత్య.. శరీరంపై టాటూగా శత్రువుల పేర్లు!

ప్రాథమిక సమాచారం ప్రకారం లలితా కయి.. గత పదేళ్లుగా ఇండియాలో నివసిస్తున్నారు. ఆమె అమెరికా వీసా గడువు ముగిసిందని పోలీసులు గుర్తించారు. ఆమె పౌరసత్వాన్ని నిర్ధారించేందుకు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ అధికారులను సంప్రదించినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు చాలా నీరసంగా ఉన్నందున వివరాలు వెల్లడించే పరిస్థితిలో లేదన్నారు. కొద్ది రోజుల నుంచి ఆహారం తీసుకోన్నందున ఆమె నీరసించిపోయినట్టు చెప్పారు. ఎన్నిరోజులుగా అడవిలో ఉందో ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆమెను భర్తే చెట్టుకు బంధించి వెళ్లిపోయాడని అనుమానిస్తున్నట్టు చెప్పారు. అతడు తమిళనాడుకు చెందిన వాడన్నారు. ఆమె సంబంధీకులను కనుగొనేందుకు తమిళనాడు, గోవా, ఇతర ప్రాంతాలకు తమ టీమ్ లను పంపినట్టు వెల్లడించారు.

Also Read : మహా ముదుర్లు.. ఎంత పద్ధతిగా ఉన్నారో.. అంత గలీజు పనిచేశారు!