PM Modi : ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ.. టాప్-10 జాబితాలో ఏఏ దేశాల నేతలకు చోటుదక్కిందంటే?

ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 39శాతం మంది మద్దతు మాత్రమే లభించింది. ఒక చివరి స్థానంలో జపాన్ ప్రధాని పుమియొ కిషిద లిచారు.

PM Modi : ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ.. టాప్-10 జాబితాలో ఏఏ దేశాల నేతలకు చోటుదక్కిందంటే?

popular global leaders in 2024

popular global leaders in 2024 : ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన 25 మంది నేతల జాబితాను రూపొందించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 69శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. గతంలో వెలువడిన సర్వేల్లోనూ ప్రధాని మోదీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వెలువడిన జాబితాలో మోదీ తరువాతి స్థానాల్లో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవీయర్ మిలి, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు వియోల్ అమ్హెర్డ్, ఐర్లాండ్ ప్రధాని సైమన్ హారిస్ నిలిచారు.

Also Read : ఒలింపిక్స్‌లో ఇవాళ కీలక ఈవెంట్లు.. లక్ష్యసేన్ వైపు భారత్ చూపు.. 100 మీటర్ల పరుగులో విజేత ఎవరో?

ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 39శాతం మంది మద్దతు మాత్రమే లభించింది. ఒక చివరి స్థానంలో జపాన్ ప్రధాని పుమియొ కిషిద నిలిచారు. ఆసక్తికర విషయం ఏమిటంటే కొత్తగా బాధ్యతలు చేపట్టిన యూకే ప్రధాని కైర్ స్టార్మర్, మాజీ పీఎం రిషి సునక్ స్థానంలో గ్లోబల్ పాపులర్ లీడర్ల టాప్ -10 లిస్ట్ లో చోటు చంపాదించాడు.

Also Read : Real TDR Projects : భారం తగ్గనుంది.. టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్న హెచ్ఎండీఏ

టాప్ 10 దేశాధినేతలు వీరే..
నరేంద్ర మోదీ (భారత్): 69శాతం
ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ (మెక్సికో అధ్యక్షుడు) : 63శాతం
జేవియర్ మిలి (అర్జెటీనా అధ్యక్షుడు) : 60శాతం
వియోలా అమ్హెర్డ్ (స్విట్టర్లాండ్ అధ్యక్షుడు) : 52శాతం
సైమన్ హారిస్ (ఐర్లాండ్ ప్రధాని) : 47శాతం
కీర్ స్టార్మర్ (బ్రిటన్ ప్రధాని) : 45శాతం
డొనాల్డ్ టస్క్ (పోలండ్ ప్రధాని) : 45శాతం
ఆంథోనీ అల్బనీస్ (ఆస్ట్రేలియా ప్రధాని) : 42శాతం
పెడ్రో సాంచెజ్ (స్పెయిన్ ప్రధాని) : 40శాతం
జార్జియా మెలోని (ఇటలీ ప్రధాని) : 40శాతం