అక్రమ సంబంధం వద్దన్నందుకు భార్య తల నరికాడు..ఆపై తలను చేతితో పట్టుకుని

  • Published By: madhu ,Published On : July 23, 2020 / 01:21 PM IST
అక్రమ సంబంధం వద్దన్నందుకు భార్య తల నరికాడు..ఆపై తలను చేతితో పట్టుకుని

అక్రమ సంబంధం వద్దు..మాతోనే ఉండు..డబ్బులివ్వకపోవడంతో ఇళ్లు గడవడం కష్టంగా ఉంది..లేకపోతే పోలీసులుక చెబుతా..అన్న మాటలకు ఓ భర్తకు విపరీతమైన కోపం వచ్చేసింది. అంతే..తాగిన మత్తులో…ఆమె తలను నరికేశాడు. అంతేకాదు..తల..మొండం వేరు చేశాడు. చేతిలో తల పట్టుకుని వెళుతున్నాడు. ఒళ్లు జలదరించే ఈ ఘటన ఏపీ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

సత్తనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన ముప్పన శ్రీనివాసరావుకు తండ్రి చనిపోవడంతో అతనికి ఉద్యోగం వచ్చింది. శ్రీనివాసరావుకు మాండ్ల అంకమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. వీరి సంసారం సజావుగానే సాగేది. అయితే..ఐదు సంవత్సరాల క్రితం..సాధారణ బదిలీల్లో భాగంగా…ఫిరంగిపురం మండలానికి బదిలీ అయ్యాడు.

సత్తెనపల్లిలోని NSP కాలనీకి మకాం మార్చాడు. భార్య, పిల్లలను అక్కడే ఉంచి రాకపోకలు సాగించే వాడు. ఫిరంగిపురంలో ఉంటున్న ఓ మహిళతో శ్రీనివాసరావుకు పరిచయం ఏర్పడింది. ఇంకేముంది..వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో మాండ్ల అంకమ్మను, పిల్లలను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. ఇంటికి రావడం పూర్తిగా మానేశాడు.

ఈ క్రమంలోనే మద్యానికి బానిసయ్యాడు. జీతం ఇవ్వకపోవడంతో ఇంటిని గడపడం అంకమ్మకు కష్టతరంగా మారింది. తన భర్త ఇంటికి ఎందుకొస్తడలేడు..అనే విషయంపై ఆరా తీయడం ప్రారంభించింది అంకమ్మ. ఫిరంగిపురం ఇంటికి వెళ్లి భర్త ఇంటిని పరిశీలించింది. మరో మహిళతో ఉండడం ప్రత్యక్షంగా చూసింది.

దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం భర్తను వెంట పట్టుకుని సత్తెనపల్లికి చేరుకుంది. ఇక శ్రీనివాసరావు ఎప్పుడు వచ్చినా..అర్ధరాత్రి ఇంటికి రావడం..తెల్లవారుజామునే వెళ్లిపోవడం చేస్తుండే వాడు. దీంతో శ్రీనివాసరావు, అంకమ్మ మధ్య గొడవలు జరిగేవి. 2020, జులై 20వ తేదీ సోమవారం ఫుల్ గా మందు తాగొచ్చాడు.

రాత్రి అంకమ్మతో గొడవకు దిగాడు. తన సోదరుడు అంకారావుకు ఫోన్ లో గొడవ విషయం చెప్పింది. అర్ధరాత్రి సమయంలో ఇంకా శ్రీనివాసరావు గొడవ చేస్తుండడంతో పోలీసులకు చెబుతానని అంకమ్మ బెదిరించింది. పీఎస్ కు వెళుతున్న క్రమంలో..వెనుకనుంచి మొండి కొడవలితో అంకమ్మ మెడపై వేటు వేశాడు.

అక్కడనే కుప్పకూలిన అంకమ్మ తల, మొండాన్ని వేరు చేశాడు. తలను చేతిలో పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్య శాలకు తరలించరు. తల్లి మరణం, తండ్రి జైలుకు వెళ్లడంతో..ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు.