Committee Kurrollu : ‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ రివ్యూ.. 90s కిడ్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా..

90s కిడ్స్ మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఫ్రెండ్స్ తో కలిసి చూడాల్సిందే.

Committee Kurrollu : ‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ రివ్యూ.. 90s కిడ్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా..

Niharika Konidela Committee Kurrollu Movie Review and Rating

Committee Kurrollu Movie Review : మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్ళు. కొత్త దర్శకుడు య‌దు వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పాపులర్ అయిన వాళ్ళని, కొత్త వాళ్ళని మెయిన్ లీడ్స్ గా తీసుకొని ఈ సినిమా నిర్మించడం విశేషం. ముందు నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా నేడు ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. ఒక ఊళ్ళో కొంతమంది స్నేహితులు ఉంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఆ ఊళ్ళో 12 ఏళ్లకు ఒకసారి జాతర జరుగుతుంది. ఫ్రెండ్స్ అంతా ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక విషయంలో వాళ్ళల్లో వాళ్లకు గొడవలు వచ్చి విడిపోతారు. ఆ గొడవలతో ఆ సంవత్సరం జాతరలో గొడవలు అవ్వడం, వీళ్ళ ఫ్రెండ్స్ లో ఒకరు చనిపోవడం జరుగుతుంది. దీంతో ఫ్రెండ్స్ అంతా విడిపోయి ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు.

మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత అదే జాతరకు ఫ్రెండ్స్ అంతా ఊరికి రావడం, జాతరలో ఓ సమస్య ఉండటం, అదే సమయంలో ఊరి పంచాయితీ ఎన్నికలు ఉండటం జరుగుతాయి. మరి ఈ ఫ్రెండ్స్ మధ్య అసలు గొడవలు ఎందుకొచ్చాయి, వీళ్ళు 12 ఏళ్ళ తర్వాత అయినా కలిసారా? మళ్ళీ ఆ ఊరి జాతరని ఈ ఫ్రెండ్స్ జరిపించారా? ఎన్నికల్లో ఎవరు గెలిచారు అనేది తెరపై చూడాల్సిందే.

Also Read : Simbaa : ‘సింబా’ మూవీ రివ్యూ.. అనసూయ సినిమా ఎలా ఉందంటే?

సినిమా విశ్లేషణ.. కమిటీ కుర్రోళ్ళు సినిమా ఒక కథలాగా కాకుండా ఒక ఊళ్ళో కొంతమంది స్నేహితుల మధ్య జరిగే సంఘటనలతో తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమా 90s కిడ్స్ కి బాగా నచ్చుతుంది. సినిమాలో ఉండే ఫ్రెండ్స్ ని మూడు కాలాల్లో చూపించారు. చిన్నప్పుడు బాల్యం, ఇంటర్ చదివే సమయంలో యవ్వనం, పెరిగి పెద్దయ్యాక లైఫ్.. ఇలా మూడు కాలాల్లో సంఘటనలు చాలా చక్కగా చూపించారు. సినిమా చుపిస్తున్నంతసేపు కచ్చితంగా మన బాల్యం, మన ఫ్రెండ్స్, మన కాలేజీ డేస్ గుర్తొస్తాయి. 90s కిడ్స్ చేసిన చిలిపి పనులు, అప్పట్లో ప్రేమలు.. అన్ని చక్కగా చూపించారు.

వీటితో పాటు సమాజంలో ఉన్న ఓ సమస్యని కూడా ప్రశ్నించారు. వీటన్నిటిని కూడా గోదావరి బ్యాక్ డ్రాప్ లో చూపించడంతో తెరపై ఇంకా అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఫుల్ గా నవ్వించినా ఇంటర్వెల్ ముందు నుంచి ఎమోషన్ తోనే నడిపిస్తారు. సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్ చేసి ప్రేక్షకులని ఏడిపిస్తారు. క్లైమాక్స్ మాత్రం రెగ్యులర్ ఎన్నికల గొడవలాగా చూపించారు. ఒక పదేళ్లు వెనక బ్యాక్ డ్రాప్ ఉండటంతో డ్రెస్సులు, లొకేషన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఆ కాలానికి తగ్గట్టు చూపించారు. 90s కిడ్స్ మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఫ్రెండ్స్ తో కలిసి చూడాల్సిందే.

Niharika Konidela Committee Kurrollu Movie Review and Rating

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాలో సాయి కుమార్,గోపరాజు రమణ, కంచెరపాలెం కిషోర్.. వీరంతా మెప్పించారు. మిగిలిన మెయిన్ లీడ్స్ అందర్నీ కొత్తవాళ్ళని తీసుకున్నారు. సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, టీనా శ్రావ్య, రాధ్య సురేష్, తేజస్వి రావు.. ఇలా మెయిన్ లీడ్స్ లో నటించిన కొత్తవాళ్లంతా కూడా ఆ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. వాళ్ళని చూస్తుంటే మనం, మన ఫ్రెండ్స్ కూడా అలాగే ఉండేవాళ్ళం అనిపిస్తుంది. 30 ఏళ్ళ వయసులో, 17 ఏళ్ళ వయసులో వేరియేషన్ కనపడటానికి కొత్త నటీనటులంతా బాగా కష్టపడ్డారు. కమిటీ కుర్రోళ్ళు సినిమాలో మెయిన్ లీడ్స్ లో ఫ్రెండ్స్ గా నటించిన అబ్బాయిలు, అమ్మాయిలు అందరికి మంచి ఫ్యూచర్ ఉంటుంది.

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనుదీప్ అదరగొట్టేసాడు. చాలా సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే ఏడిపించేస్తారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ కాలానికి తగ్గట్టు పర్ఫెక్ట్ గా చూపించారు. కథ పరంగా ఒక లైన్ లేకపోయినా కథనం మూడు కాలాల్లో జరుగుతున్నట్టు చాలా అందంగా రాసుకొని దానికి డైలాగ్స్ కూడా బాగా రాసుకొని దర్శకుడు యదు వంశీ పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు. మొదటి సినిమాతోనే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక నిర్మాతగా నిహారిక మరోసారి తన స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుందని నిరూపించింది.

మొత్తంగా కమిటీ కుర్రోళ్ళు సినిమా కొంతమంది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితులు, వాళ్ళ మధ్య గొడవలతో ఎమోషనల్ గా, పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలా చూపించారు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిందే. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.